Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఇక ఈ చిత్రంలో చిరు సరసన త్రిష నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పోటీపడడానికి రెడీ అవుతుంది.
బింబిసార తో హిట్ అందుకున్న వశిష్ఠ.. విశ్వంభరతో మరో హిట్ ను అందుకోవడానికి సిద్దమవుతున్నాడు. ఇక దీనికోసం స్టార్ క్యాస్టింగ్ ను ఎంచుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో చిరుకు చెల్లెలిగా రమ్య పసుపులేటి సెలెక్ట్ అయ్యిందన్న విషయం తెల్సిందే.
ఇక తాజాగా ఈ సినిమాలోకి మరో బ్యూటీ వచ్చి చేరింది. ప్రేమ కావాలి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ఇషా చావ్లా. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్న ఈ బ్యూటీ ఈ సినిమా ఆ తరువాత పూల రంగడు, శ్రీమన్నారాయణ, మిస్టర్ పెళ్లి కొడుకు, జంప్ జిలానీ లాంటి సినిమాలు చేసింది కానీ, ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయాయి.
ఇక చాలా గ్యాప్ తరువాత ఈ చిన్నది .. విశ్వంభర తో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాలో ఇషా ఒక కీలక పాత్రలో నటిస్తుందని టాక్. అందుతున్న సమాచారం ప్రకారం చిరుకు మరో చెల్లెలిగా నటిస్తుందని అంటున్నారు. తాజాగా చిరుతో ఇషా కలిసి దిగిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
అయితే ఈ ఫొటోలో ఇషా లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. అస్సలు ఆమెను గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎవరీమె .. కొత్త నటినా అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. ప్రేమ కావాలి సినిమా తరువాత ఈ చిన్నదానికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉండేది. విజయాలు అందలేదు కానీ, లేకపోతే స్టార్ డమ్ ను అందుకొనేది. ఇప్పుడు ఆ హీరోయినేనా ఇలా మారింది అని ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతు అయ్యింది. మరి ఈ సినిమాతోనైనా ఇషా హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.