BigTV English

Katrina Kaif London Trip: ప్రెగ్నెన్సీ చికిత్స కోసం లండన్ వెళ్లిన నటి కత్రినా కైఫ్.. క్లారిటీ ఇచ్చిన టీం!

Katrina Kaif London Trip: ప్రెగ్నెన్సీ చికిత్స కోసం లండన్ వెళ్లిన నటి కత్రినా కైఫ్.. క్లారిటీ ఇచ్చిన టీం!

Katrina Kaif Team Clarification on London Trip: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి పెద్ద చెప్పక్కర్లేదు. తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన ‘మళ్లీశ్వరీ’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో తన అందం, అభినయంతో సినీ ప్రియుల్ని ఫిదా చేసింది. ఈ మూవీ హిట్ కావడంతో కత్రినా తెలుగులో దూసుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత బాలయ్యబాబుతో ‘అల్లరి పిడుగు’ మూవీలో నటించింది. ఈ మూవీ పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోవడంతో టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి మకాం మర్చింది.


అక్కడ మాత్రం మంచి స్టార్డమ్ అందుకుంది. వరుసగా సినిమాలు చేస్తూ మంచి హిట్లు అందుకుని స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తన డ్యాన్స్‌తో అందరి మనసులు దోచుకుంది. ఇందులో భాగంగానే అక్కడ డ్యాన్సింగ్ క్వీన్‌గా గుర్తింపు పొందింది. అందులోనూ.. చిక్కినీ చమ్మేలి, షీలా కీ జవానీ వంటి స్పెషల్ సాంగ్స్‌తో మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

అయితే ఈ అందాల ముద్దుగుమ్మ తన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌తో ప్రేమలో పడింది. దీంతో కొన్నేళ్ల క్రితం ఈ జంట డేటింగ్ చేశారు. అనంతరం 2021లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఇక మ్యారేజ్ అనంతరం కత్రీనా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కుటుంబంతో కలిసి హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తుంది.


Also Read: అప్పుడు వదిలేసుకున్నా.. ఇప్పుడు ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా

ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌ను ఇటీవలే స్టార్ట్ చేసింది. 40 ఏళ్ల వయసులోనూ తన అందం ఏ మాత్రం చెక్కు చెదరకుండా.. కుర్ర హీరోయిన్‌కు పోటీగా నిలుస్తుంది. ప్రస్తుతం పలు సినిమాలతో దూసుకుపోతుంది. ఇందులో భాగంగానే కత్రినా కైఫ్ ‘మేరీ క్రిస్మస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. అలాగే సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’లోనూ మెరిసింది. ఈ సినిమా కూడా పర్వాలేదనిపించుకుంది.

ఇదిలా ఉంటే కొద్ది రోజుల నుంచి కత్రినా ప్రెగ్నెన్సీ పై పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ అని.. అందుకోసమే చికిత్స కోసం ఆమె లండన్ వెళ్లిందంటూ నెట్టింట వార్తలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ వార్తలపై కత్రినా కైఫ్ దంపతులు స్పందించకపోగా.. ఆమె టీం ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

Also Read: Rishab Shetty: రికార్డ్ బ్రేక్ చేసిన రైతు కూతురు.. ప్రశంసల పరంపర

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ కత్రినా టీం తెలిపింది. కత్రినా కైఫ్ గర్భవతి కాదని.. ఆమె ఒక పర్సనల్ పని నిమిత్తం లండన్ వెళ్లిందని కత్రినా టీం క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా త్వరలో కత్రినా భర్త విక్కీ కౌశల్ కూడా లండన్ వెళ్తారని తెలిపింది. దీంతో కత్రినా ప్రెగ్నెంట్ వార్తలకు చెక్ పెట్టినట్లయింది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×