BigTV English

Lok Sabha Elections 2024: పోలింగ్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు: డీజీపీ రవి గుప్తా

Lok Sabha Elections 2024: పోలింగ్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు: డీజీపీ రవి గుప్తా

Lok Sabha Elections 2024: సోమవారం జరగనున్న పోలింగ్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని తెలంగాణ డీజీపీ రవి గుప్తా తెలిపారు. 73,414 మంది సివిల్ పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. 50 మంది తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగాలు పాల్గొంటాయని ఆయన అన్నారు.


తెలంగాణలో జరగనున్న పోలింగ్‌కు మొత్తం 164 కేంద్ర బృందాలతో బందోబస్తు నిర్వహిస్తున్నామని డీజీపీ రవి గుప్తా తెలిపారు. తమిళనాడు నుంచి 3 స్పెషల్ ఆర్మ్‌డ్ బృందాలు బందోబస్తులో భాగమవనున్నాయని తెలిపారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి 7 వేల మంది హోంగార్డులు ఎన్నికల బందోబస్తులో పాల్గొంటారని తెలంగాణ డీజీపీ స్పష్టం చేశారు.

ఇక సోమవారం తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 17 ఎంపీ స్థానాల బరిలో మొత్తం 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అటు నామినేషన్లలోనూ తెలంగాణ రికార్డు సృష్టించింది. నాలుగో విడుత ఎన్నికల్లో భాగంగా తెలంగాణతో పాటు మొత్తం 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని 17 స్థానాలకు 1488 నామినేషన్లు వచ్చాయి.


పోలింగ్ నేపథ్యంలొ ఇవ్వళ ఉదయం 7 గంటల నుంచే డీజీపీ కార్యాలయంలో కమండ్ కంట్రోల్ రూం అందుబాటులోకి వచ్చిందని డీజీపీ రవి గుప్తా స్పష్టం చేశారు. పోలింగ్ ముగిసి, ఈవీఎంలన స్ట్రాంగ్‌ రూంల్లోకి సేఫ్ గా తరలించేంతవరకు కమాంబ్ కంట్రోల్ రూం నిరంతరంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఇక పోలీస్ సిబ్బంది కోసం కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు.

పోలింగ్‌కు ముందు నేతలు, రాజకీయ పార్టీలు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించడంతో డబ్బు, మద్యం, తాయిలాల పంపకాలు జరిగే అవకాశం ఉందని, నిఘా వ్వవస్థ పటిష్టం చేశామన్నారు డీజీపీ రవి గుప్తా.

Also Read: ఎవరెవరు ఎన్ని సభలలో పాల్గొన్నారంటే..

అటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. 25 పార్లమెంట్ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు ఏపీలోని 25 స్థానాలకు 1103 నామినేషన్లు వచ్చాయి. చివరికి 454 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రేపు జరగనున్న ఎన్నికలకు జూన్ 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×