Curd foods, turmeric, Spicy Foods Should Avoid With Tea: టీ చాలా మంది దైనందిన జీవితంతో ముడిపడి ఉంటుంది. చాలా మందికి టీ తాగనిదే రోజు గడవదు. భారత దేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన హాట్ డ్రింక్ టీ. టీ తాగితే మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెబుతుంటారు. చాలా మంది టీ తాగేటప్పుడు బిస్కెట్స్, చిప్స్ వంటి స్నాక్స్ తింటారు. టీతో పాటు వివిధ రకాల ఫుడ్స్ తింటూ ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆ ఫుడ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శనగపిండితో చేసిన చిరుతిండ్లు
టీతో పాటు పకోడి, మిక్చర్, ఫుజియా వంటివి తినడానికి ఇష్టపడతారు. వీటిని పప్పు పిండితో తయారు చేస్తారు.శనగపిండితో తయారు చేసిన ఆహార పదార్థాలు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కలిగిస్తాయి. అంతే కాకుండా పోషకాలను గ్రహించే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. కాబట్టి టీ తాగే టప్పుడు ఇలాంటి చిరుతిండ్లను తినకుండా ఉండటం మంచిది.
చల్లని ఆహారం
ప్రతి ఇంట్లో సాధారణంగా టిఫిన్స్, పచ్చళ్లు, కొన్ని చల్లటి ఆహార పదార్థాలతో పాటు వేడి టీని తాగుతుంటారు. కానీ వీటిని ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బలహీనపడుతుంది. అంతే కాకుండా వాంతులు, విరోచనాలు అయ్యేందుకు కారణం అవుతుంది. టీ వంటి హాట్ డ్రింక్ తాగిన తర్వాత 30 నిమిషాల పాటు చల్లని ఆహారం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Chia Seeds For Glowing Skin: చియా సీడ్స్‌తో గ్లాస్ స్కిన్.. ఎలా వాడాలో తెలుసా మరి..?
పసుపుతో చేసిన ఆహారాలు
పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది టీతో దూరంగా ఉండాల్సి పదార్ధం. ఎందుకంటే పసుపు ఉన్న ఆహారాలు, గ్యాస్, మలబద్ధకం సమస్యకు కారణం అవుతాయి. టీ తాగిన తర్వాత పసుపు వాడిన ఆహార పదార్థాలను తినకుండా ఉంటేనే మంచిది.
టీలో నిమ్మకాయ
లెమన్ టీ తాగడం వల్ల ఎసిడిటీ వస్తుందట. నిమ్మకాయల్లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది వికారం అనుభూతిని కలిగిస్తుంది. నిమ్మరసం ఉన్న టీ మరింత ఆమ్లంగా మారుస్తుంది. ఉదయాన్నే లెమన్ టీ తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
Also Read మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..సమ్మర్ లో పాటించాల్సిన చిట్కాలు
ఐరన్ రిచ్ ఫుడ్స్
టీలో టానిన్లు, ఆక్సిలేట్స్ ఉంటాయి. ఇది శరీరంలోని ఐరన్ శోషణను నిరోధిస్తుంది. అంతే కాకుండా వాటిని బంధిస్తుంది కూడా.. వేడి టీతో ధాన్యాలు, ఆకు కూరలు, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినకూడదు.