BigTV English

Actress Kutti Padmini: బాలనటిగా ఉన్నప్పుడే నాపై లైంగిక వేధింపులు, చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు: నటి కుట్టి పద్మిని

Actress Kutti Padmini: బాలనటిగా ఉన్నప్పుడే నాపై లైంగిక వేధింపులు, చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు: నటి కుట్టి పద్మిని

Actress Kutti Padmini Says Sexual Harassment even in TV industry: సినిమా ఇండస్ట్రీలో బాలనటిగా తన ముద్దు ముద్దు మాటలతో అలరించింది కుట్టి పద్మిని. కుట్టి పద్మిని అనగానే తెలుగులో లేత మనసులు మూవీ గుర్తుకువస్తుంది అలనాటి ప్రేక్షకులకు. ఆ మూవీలో ఆమె ద్విపాత్రాభినయం చేసి తన బాల్యంలోనే టెలెంటెడ్ నటిగా పేరు తెచ్చుకుంది. మూడవ ఏడే నటిగా వెండితెరపై కనిపించింది. తమిళ సాంప్రదాయ అయ్యంగార్ కుటుంబంలో జన్మించిన కుట్టి పద్మిని హీరోయిన్ గా పెద్దగా రాణించలేదు. అయితే సీనియర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టీవీ సీరియల్స్ లో నటించి , సొంతంగా ప్రొడక్షన్ హౌస్ నడుపుతున్న కుట్టి పద్మిని పలు టీవీ సీరియల్స్ నిర్మించారు. తమిళ, తెలుగు లోనూ తనదైన ముద్ర వేశారు. అయితే ఇటీవల మలయాళ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై కుట్టి పద్మిని స్పందించారు.


టీవీ రంగానికీ పాకిన క్యాస్టింగ్ కౌచ్

క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా పరిశ్రమలోనే కాదు టీవీ రంగంలోనూ ఈ తరహా వేధింపులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు తాము పనిచేసే ప్రదేశంలో మగవారి నుంచి రక్షణ లేకుండా పోయిందని అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ దుర్మార్గం ఇప్పుడిప్పుడే టీవీ రంగంలోనూ విస్తరిస్తోందని వ్యాఖ్యానించారు. తాను బాలనటిగా ఉన్నప్పటినుంచే ఇలాంటి లైంగిక వేధింపులు అనుభవించానని..కెరీర్ ను దృష్టిలో పెట్లుకుని అన్ని అవమానాలు మౌనంగా భరించానని అన్నారు. సీరియల్ లో ఫలానా అమ్మాయి కొనసాగాలంటే తమ కోర్కెలు తీర్చాలంటూ నిర్మాత, దర్శకులు, టెక్నీషియన్స్ నుంచి అందరూ వేధిస్తుంటారని కుట్టి పద్మిని అన్నారు. తాను అందంగా కనిపించాలంటే కెమెరా మెన్ చెప్పినట్లు చేయాలి. మేకప్ మేన్ కూడా వేధింపులకు గురిచేయడం ..ఇవన్నీ బయటకు చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్న నటీమణులు అసలు ఈ రంగంలోకి ఎందుకొచ్చామా అని ఫీలవుతున్నారు.


మహిళలకు భద్రత ఏది?

సమాజంలో డాక్టర్లు, లాయర్లు ఫ్రొఫెషనల్ గా ఎలా రాణిద్దామని అనుకుంటారో నటన అనేది కూడా ప్రొఫెషన్ గా భావించాలని ఆ వృత్తికి గౌరవం ఇవ్వాలని..కుట్టి పద్మిని కోరారు. తమపై జరుగుతున్న లైంగిక వేధింపులను ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఆడవారు కొట్టుమిట్టాడుతున్నారని అన్నారామె. చాలా మంది అవమానంతో ఆత్మహత్యలకు సైతం పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. అవన్నీ ఆమె వ్యక్తిగత వ్యవహారాలని పోలీసులతో కుమ్ముక్కై కేసును పక్కతోవ పట్టిస్తుంటారు. జీవితంలో ఏదో సాధిద్దామని అనుకుని ఈ రంగానికి అనేక మంది అమాయకపు ఆడపిల్లలు వస్తుంటారు..గ్లామర్ రంగం కాబట్టి తేలిగ్గా ఆకర్షితులవుతుంటారు అమ్మాయిలు. వారి వీక్ నెస్ పసిగట్టి కొందరు దుర్మార్గులు మెల్లిగా రొంపిలోకి దించుతుంటారని..అలా చేస్తే అవకాశాలు వస్తాయని చెప్పి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని కుట్టి పద్మిని ఆరోపించారు.

హీరో విశాల్ ఖండన

కోలీవుడ్ లోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని హీరో విశాల్ అన్నారు. హేమ కమిటీ లాంటి దే కోలీవుడ్ పరిశ్రమలోనూ ఏర్పాటు చేయాలని తన ఉద్దేశం తెలిపారు హీరో విశాల్. ఇప్పుడు కుట్టి పద్మిని టీవీ రంగంలో లైంగిక వేధింపుల వ్యవహారాన్ని బయట పెట్టడంతో టీవీ రంగానికి సంబంధించి ఓ మహిళా కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందనే చర్చకు తెరతీసినట్లయింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×