Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఓ భారీ స్కాం ను ఆధారాలతో సహా బయట పెట్టినందుకు ప్రముఖ రిపోర్టర్ ముఖేష్ చంద్రకరణ్ ను కొందరు దుండగులు హతమార్చడంతో… ఆయనకి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పోరాటం మొదలుపెట్టింది.
టాలీవుడ్ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి ట్విట్టర్ వేదికగా తన న్యాయ పోరాటాన్ని మొదలుపెట్టింది. న్యాయ పోరాటమా? అసలు ఏమైంది? అని షాక్ అవుతున్నారా.. చత్తీస్గడ్ లో జర్నలిస్టుగా పనిచేస్తున్న ముఖేష్ చంద్రకర్ ఓ భారీ స్కాంను ఆధారాలతో సహా బయటపెట్టాడు. దీంతో అతన్ని కొందరు దుండగులు చంపేశారు. లావణ్య త్రిపాఠి అతనికి న్యాయం చేయాలంటూ ట్విట్టర్ వేదికగా స్పందించింది. తాను పెట్టిన పోస్టు హ్యాస్ ట్యాగ్ లో ముఖేష్ చంద్రకరణ్ పేరు పెట్టింది. ఈ ఘటనపై లావణ్య్ స్పందించటమే కాకుండా.. బాధిత కుటుంబానికి అండగా నిలబడింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణంగా ఇలాంటి విషయాల్లో సెలబ్రిటీలకు స్పందించడం చాలా అరుదు. ఇప్పటివరకు ఏ సెలబ్రెటీ ఇలాంటి విషయాలపై స్పందించలేదు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని తెలపలేదు. కానీ లావణ్య త్రిపాఠి స్పందిస్తూ బాధిత కుటుంబానికి అండగా నిలబడింది.
ఇక హీరోయిన్ గా పరిచయం అవసరం లేని పేరు లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరోయిన్.. తొలి సినిమాతోనే తన నటనతో, అమాయకత్వంతో అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అందరు యంగ్ హీరోలతో లావణ్య్ నటించింది. ఇక లావణ్య మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి 2023లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వరుణ్, లావణ్య రెండు సినిమాల్లో కలిసి నటించారు. అవి “మిస్టర్” “అంతరిక్షం”. ఈ సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్టు తెలుస్తోంది. ఈ ప్రేమ కాస్త ఇరు కుటుంబాల అంగీకరించడంతో పెళ్లిగా మారి మెగా కోడలు అయింది లావణ్య. ఇక 2023 నవంబర్ 1న వీరిద్దరి పెళ్లి ఇటలీలో చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లి తర్వాత వరుణ్ సినిమాలతో బిజీ అయిపోగా లావణ్య త్రిపాఠి మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది
మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో లావణ్య కొన్ని రోజుల ముందే ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం సతీ లీలావతి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి లావణ్య సన్నహాలు చేస్తుంది. ఇక సతీ లీలావతి సినిమా నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రంగా తెలుస్తోంది. భీమిలి కబడ్డీ జట్టు, ఎస్ఎంఎస్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన తాతినేని సత్య ఈ సినిమాకు డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశం కనిపిస్తుంది.
ALSO READ : ఏడాది పూర్తి చేసుకున్న హనుమాన్.. డైరెక్టర్ స్పెషల్ పోస్ట్..!