BigTV English

1 year of Hanuman: ఏడాది పూర్తి చేసుకున్న హనుమాన్.. డైరెక్టర్ స్పెషల్ పోస్ట్..!

1 year of Hanuman: ఏడాది పూర్తి చేసుకున్న హనుమాన్.. డైరెక్టర్ స్పెషల్ పోస్ట్..!

1 year of Hanuman:ప్రముఖ యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా.. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన చిత్రం హనుమాన్ (Hanuman). గత ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాతో పాటు వచ్చిన పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. ముఖ్యంగా మహేష్ బాబు(Mahesh Babu) ‘గుంటూరు కారం’ సినిమా కూడా ఈ సినిమా ముందు నిలవలేకపోయింది అంటే, ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ హనుమాన్ సినిమాతో హీరో తేజాతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు.


ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ కి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పార్ట్ వన్ హనుమాన్ వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా.. డైరెక్టర్ ఒక ఎమోషనల్ ట్వీట్ కూడా పెట్టాడు. ప్రశాంత్ వర్మ తన పోస్టులో.. “నా హృదయానికి ఎంతో దగ్గరైన హనుమాన్ సినిమా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఇది నాలో శాశ్వత భాగంగా కూడా మారిపోయింది. బలానికి ప్రతీకగా ఓర్పు, నమ్మకం, విశ్వాసంతో పాటు స్థిరంగా ఉండడానికి నిశ్శబ్ద రిమైండర్ గా ఇది మారిపోయింది” అంటూ ఒక పోస్ట్ పెట్టాడు ప్రశాంత వర్మ. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో, జై హనుమాన్ అప్డేట్ ఇవ్వాలి అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా అప్డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి. ఇకపోతే ప్రశాంత్ వర్మ తన చిటికెన వేలు క్రింది భాగంలో హనుమాన్ ఆయుధమైన గధను టాటూగా వేయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ టాటూ ని చూపిస్తూ పోస్ట్ షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారుతోంది.

ప్రశాంత్ వర్మ కెరియర్..


డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విషయానికొస్తే..1989 మే 29న పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించారు. 2018లో తొలిసారి అ! అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన, ఆ తర్వాత 2019లో కల్కి, 2021 లో జాంబిరెడ్డి, దట్ ఇస్ మహాలక్ష్మి సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన ఈయన, 2024 లో హనుమాన్ సినిమా చేసి ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం ఈయనతో సినిమాలు చేయడానికి సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు కూడా రంగంలోకి దిగడంతో.. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంతారా సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న రిషబ్ శెట్టి కూడా జై హనుమాన్ సినిమాలో భాగమయ్యారు అంటే ఇక ప్రశాంత్ వర్మ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు జై హనుమాన్ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×