Actress Laya: సినీనటి లయ (Laya)బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. భద్రం కొడుకు అనే సినిమా ద్వారా బాల నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈమె స్వయంవరం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న లయ మొదటి సినిమాకి ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన లయ తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే డాక్టర్ ను వివాహం చేసుకొని అమెరికా వెళ్లిపోయారు. ఇలా అమెరికా వెళ్లిన ఈమె పూర్తిగా సినిమాలకు కూడా గుడ్ బై చెబుతూ అక్కడే తన పిల్లలు భర్తతో కలిసి ఉండేవాళ్లు. ఈ విధంగా సినిమాలకు దూరమైన లయ తిరిగి ఇండస్ట్రీలోకి వస్తే బాగుంటుందని అభిమానులు అందరూ ఎదురు చూస్తారు.
గ్రాండ్ రీఎంట్రీ..
ఇక ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికకు మాత్రం ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉండేవారు. ఇకపోతే తిరిగి సినిమాలలో నటించడం కోసం ఈమె అమెరికా నుంచి ఇండియాకి వచ్చేశారు. ఇలా ఇండియా వచ్చేసిన లయ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె నితిన్(Nithin) హీరోగా నటించిన తమ్ముడు (Thammudu)సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
నా ఇంటికి తిరిగి వచ్చాను…
ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా మంచి ఆదరణ లభిస్తుంది ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ లంచ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో లయ మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా లయ మాట్లాడుతూ.. తాను కెమెరా ముందుకు వచ్చి 20 సంవత్సరాలు అవుతుందని తెలిపారు. ఇలా చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు రావడంతో ఈమె ఎమోషనల్ అవ్వటమే కాకుండా 20 ఏళ్ల తర్వాత తిరిగి కెమెరా ముందుకు రావడంతో నేను ఇన్ని సంవత్సరాలకు తిరిగి నా ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతుందని తెలిపారు.
ఎన్నో త్యాగాలు చేశారు…
20 ఏళ్ల తర్వాత నేను సినిమాలలో నటించడానికి నా భర్త పిల్లలు ఎంతగానో ప్రోత్సహించారని వారి ప్రోత్సాహం లేకపోతే ఇది జరిగేది కాదని తెలిపారు. నేను తిరిగి సినిమాలలో నటించడం కోసం వారు ఎన్నో త్యాగాలు చేశారని లయ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె తన భర్త పిల్లలను అమెరికాలోనే వదిలి సినిమాలలో నటించాలన్న ఆసక్తితోని ఇండియాకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన బాబు పనులన్నీ తన కూతురు చాలా బాగా చూసుకుంటుందని ఆ విషయంలో తనకు ఎలాంటి బాధ లేదని అందుకే తాను తిరిగి సినిమాలలోకి రావడానికి కూడా కుదిరిందని లయ పలు సందర్భాలలో తెలిపారు. ఇక ఈ సినిమాలో హీరోకి అక్క పాత్రలో నటించబోతున్నారు. ఈమె పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందని తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. మరి తమ్ముడు సినిమా లయకు రీ ఎంట్రీకి మంచి సక్సెస్ అందిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.