Actor Benerjee : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో బెనర్జీ(Benerjee) ఒకరు. ఈయన గత కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ అద్భుతమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించిన బెనర్జీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా గతంలో ఈయన మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న ఘటన గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఆసక్తికరమైన సమాధానాలను చెప్పారు.
గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినప్పుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) వర్సెస్ మంచు విష్ణు(Manchu Vishnu) అనే విధంగా గొడవలు చోటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే బెనర్జీ మాత్రం ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నిలిచారు. అప్పట్లో మా అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయని చెప్పాలి. ఇక ఈ ఎన్నికలలో మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రకాష్ రాజు ప్యానెల్ నుంచి సుమారు 11 మంది వరకు గెలిచారు కానీ మంచు విష్ణు గెలిచిన తర్వాత ఆ 11 మంది కూడా రాజీనామా ప్రకటించారు. ఇలా రాజీనామా తర్వాత ప్రెస్ మీట్ కార్యక్రమంలో బెనర్జీ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు.
కించపరుస్తూ మాటలు…
ఇలా కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణం ఏంటి అంటు తాజాగా ఈయన పాల్గొన్న ఇంటర్వ్యూలో తనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇలా ఈ ప్రశ్నకు బెనర్జీ సమాధానం చెబుతూ తాను ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడతాను. ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోనని తెలిపారు. మరి ఆరోజు ఏడవడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఎదురు కావడంతో అందరి ముందు మోహన్ బాబు గారు చాలా గట్టిగా అరిచారు. మా ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రంలో మోహన్ బాబు బెనర్జీ మధ్య గొడవ చోటు చేసుకోవడమే కాకుండా తన కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.అలా అరవటం వల్ల నాకు కన్నీళ్లు ఆగలేదని తెలిపారు. అరిచినప్పుడు ఎందుకు అరుస్తున్నారని ప్రశ్నించొచ్చు కదా అంటూ మరో ప్రశ్న ఎదురయింది.
మోహన్ బాబుతో మాటల్లేవ్…
ఆ సమయంలో నన్నెందుకు మాట్లాడుతున్నారు? నా తప్పు ఏమీ లేదు కదా అంటూ ప్రశ్నించవచ్చు కానీ నేను ఇలా ప్రశ్నించడం వల్ల మరికొన్ని గొడవలు జరుగుతాయి ఆ గొడవలు జరగడం నాకు ఇష్టం లేకనే ఆ రోజు ఏం మాట్లాడలేదని బెనర్జీ తెలిపారు. ఇక ఈ గొడవ తర్వాత మోహన్ బాబు గారిని తాను ఎప్పుడు కలవలేదని బెనర్జీ తెలిపారు. ఇక ప్రస్తుత హీరోల గురించి కూడా ఈయనకు ప్రశ్నలు ఎదురవడంతో ఇప్పుడున్న హీరోలు అందరూ కూడా చాలా మంచి నటీనటులని తెలియజేశారు. దర్శకత్వం చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్న ఎదురవడంతో తనకు అలాంటి ఆశలు ఏమీ లేవని తెలిపారు ఇక ప్రస్తుతం ఆయన నటించబోయే సినిమాల గురించి కూడా తెలియజేశారు.