E-Paper
Advertisement

Malavika Nair: ఏం ఉందిరా మావా.. ఎలారా ఈ పిల్ల స్టార్ అవ్వలేకపోయింది

Malavika Nair: ఏం ఉందిరా మావా.. ఎలారా ఈ పిల్ల స్టార్ అవ్వలేకపోయింది
Advertisement

Malavika Nair: ఇండస్ట్రీలో ఎవరి లక్ ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు. ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు.. ఒక్క సినిమాతో రావచ్చు. ఓవర్ నైట్ స్టార్ గా మారొచ్చు. తాజాగా ఒక హీరోయిన్ లక్ కూడా అలానే మారింది. ఆమె మాళవిక నాయర్. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రమణ్యం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ చిన్నది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇక దీని తరువాత మాళవిక ఎదగడానికి బాగానే కష్టపడింది.

ఒక పక్క హీరోయిన్ గా చేస్తూనే ఇంకోపక్క పెద్ద పెద్ద సినిమాలో క్యామియోలు కూడా చేస్తూ వచ్చింది. ముఖ్యంగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించే ఏ చిత్రంలోనైనా అమ్మడు నటించడానికి రెడీ గా ఉంటుంది. మహానటిలో కూడా మాళవిక.. ఒక ప్రత్యేక పాత్రలో నటించింది. ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు.. మాళవికకు కల్కి ద్వారా వచ్చింది. అది కూడా సినిమా రిలీజ్ అవ్వకముందే రావడం విశేషం.

Advertisement

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా.. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నటించిన నటీనటులందరూ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. అందులో మాళవిక కూడా ఒకరు.

నిన్న కల్కి రిలీజ్ ట్రైలర్ ను మేకర్ రిలీజ్ చేశారు. ఇందులో మాళవిక రెండు షాట్స్ లో కనిపించింది. ఇక ఆమె పాత్రపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఉత్తర గా ఆమె కనిపిస్తుందని, ఆమె కడుపులోని బిడ్డను చంపడానికి అశ్వద్ధామ ప్రయత్నిస్తాడని చెప్పుకొస్తున్నారు.

Advertisement

ఇక ఇంకొందరు మాత్రం మాళవిక అందానికి ఫిదా అవుతున్నారు. ఏం ఉందిరా మావా.. ఎలారా ఈ పిల్ల స్టార్ అవ్వలేకపోయింది అని, ఇప్పటివరకు ఈ అమ్మడు మనకెందుకు కనిపించలేదని కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాతో మాళవిక దశ తిరగబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా రిలీజ్ తరువాత అమ్మడు లైఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×