E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. కమల్ ప్రేమలో పడతాడా..? పార్వతికి టెన్షన్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. కమల్ ప్రేమలో పడతాడా..? పార్వతికి టెన్షన్..
Advertisement

Intinti Ramayanam Today Episode October 28th: ఆ ఎవరి తెలివిగా నా మొగుడిని మార్చేసింది ఇక వదిన ఏం చెప్తే అది చేయడానికి నా మొగుడు సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు కూడా నాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని పల్లవి అంటుంది. అంతేకాదు పల్లవి చేసిన ప్రతి పనికి కూడా అవనినే కారణం అవని చాలా ఇది చేసింది నన్ను కావాలనే దెబ్బ కొట్టింది ఎలాగైనా సరే తన అంతు చూడాలి అని అవని అంటుంది. అప్పుడే అవన్నీ సడన్గా ఇంట్లోకి రావడంతో అవని ఏం చేస్తావ్ చంపేస్తావా అని అడుగుతుంది, చంపాలన్న ఆలోచన నాకు లేదు కానీ ఒకవేళ అదే ఆలోచన గనుక వస్తే కచ్చితంగా నేను చంపేస్తాను అని పల్లవి అంటుంది. ఇక భానుమతి కూడా నా మనవుని నీకు కావాల్సినట్లు తిప్పుకుంటున్నావు నా మనవరాలు ఈ దూరం చేస్తున్నావు అని అవనిపై రెచ్చిపోయి మాట్లాడుతుంది. దాంతో అవని మీరు ఏం మాట్లాడుతున్నారు మీకైనా తెలియాలి అని అంటారు.

అవని దెబ్బకు పల్లవి షాక్..

కమల్ ని రెచ్చగొట్టి నాకు విడాకులు ఇచ్చేలా చేశావు కచ్చితంగా నీకు నేనేంటో తెలిసి చాలా చేస్తాను అని నర్మదా వార్నింగ్ ఇస్తుంది. నువ్వు అనుకున్నట్టు ఏమి చేయలేవు నీ భర్త నిన్ను చీకొట్టి బయటికి గెంటేయాలని ఆలోచిస్తున్నాడు. కానీ నువ్వు మాత్రం ఇలా చెయ్యాలని చూస్తున్నావా కొంచెం కూడా నీకు బుద్ధి లేదా అంటూ పల్లవి పోయి రెచ్చిపోతుంది ఎవరి కానీ పల్లవి మాత్రం ఏ మాత్రం బెనకకుండా తనకు నచ్చినట్లు చేస్తాను అని అంటుంది. అటు శ్రీకర్కి  అవనీ ఇచ్చిన ప్లాన్ వర్క్ అవుతుంది. ఎలాగైనా సరే ఆ మంజులని పట్టుకోవాలని శ్రీకర్ అనుకుంటూ ఉంటాడు.

పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్..

Advertisement

పల్లవి మొత్తం అవన్నీ నేను చేసింది అని అనుకుంటుంది అయితే అవని సంగతి నేను చూస్తాను అవని వల్లే ఈరోజు నా జీవితం ఎలా ఉంది అని పల్లవి అంటుంది. ఆ అవని అంత చూస్తాను అనే పల్లవి అంటుంది. అప్పుడే ఇంట్లోకి అవని సడన్గా ఎంట్రీ ఇస్తుంది. ఏం చేస్తావ్ నువ్వు నన్ను ఏం చేస్తావో చెప్పు అని అవని అంటుంది. నా జీవితం ఇలా అవడానికి కారణం నువ్వే మళ్ళీ నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని అవనిని పల్లవి అడుగుతుంది. అయితే పల్లవి నువ్వు ఎగిరెగిరి పడుతున్నవే నేను ఏదో చేశాను అని కానీ నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు అని అంటుంది. నా మనవరాలు జీవితమే నాశనం చేయాలని చూసిన నువ్వు మళ్ళీ ఇప్పుడు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా అసలు ఎందుకు వచ్చావు నువ్వు అని భానుమతి అడుగుతుంది. నా మనవరాలు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా నీ నంగనాచి మాట నీకు ఎవరు నమ్మరు అని భానుమతి అంటుంది.

భానుమతికి చక్రధర్ వార్నింగ్..

నీకు కమల్ ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు కానీ మేము ఎవ్వరం నీకు సహాయంగా ఉండము కమలకే మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం.. కమల్ ఏం చేయాలనుకుంటే అదే దానికి మేము ఎప్పుడూ సపోర్ట్ గానే ఉంటాము. ఇక అవని వెళ్లిపోయిన తర్వాత భానుమతి చూశారా మన ఇంటికి వచ్చి నా మనవరాలుకే వార్నింగ్ ఇచ్చి వెళ్తుందా..? అవని ఏం చేసినా ఊరుకుంటాము అని అనుకుంటున్నా అని భానుమతి అవని పై సీరియస్ గా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన చక్కగా అవని ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు నువ్వేమీ పెద్ద ఇది చేయొద్దు అన్నట్టుగా వార్నింగ్ ఇస్తాడు.

కమల్ ప్రేమ..

Advertisement

ఇక కొత్తగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కాకపోతే ఆ ప్లేస్లో బస్సులు రాలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక క్యాబ్ బుక్ చేసుకుంటాను అని చూస్తూ ఉండగా ఆమె తాగుబోతు అన్నయ్య ఏంటి ఎవరితోనో చాట్ చేస్తున్నావా బాయ్ ఫ్రెండ్ ఏమైనా ఉన్నాడా అంటూ అనుమానంగా మాట్లాడతాడు. కానీ దానికి ఆమె మాటకు మాట సమాధానం చెబుతుంది. అయితే అప్పుడే అక్కడికి ఓ ఇద్దరూ కుర్రాళ్ళు వచ్చి ఆమెను అల్లరి చేస్తూ ఉంటాడు. అయితే అక్కడి నుంచి పారిపోయి తనని తాను కాపాడుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తుందో చివరికి కమల్ దగ్గరికి వచ్చి చేరుతుంది.. కమల్ ఆమెను కాపాడి ప్రతిసారి ఇలా ఎవరూ రారు మీకు మీరే కాపాడుకునేలా ఉండాలి అని ఇస్తాడు అంతే ఆ సీను ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.

పార్వతికి టెన్షన్..

పార్వతి అవని అక్కడికి వెళ్ళింది కదా ఏం చేస్తుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ అవని అక్కడికి ఎందుకు వెళ్ళింది అలా వెళ్లకుండా ఉంటే బాగుండేది అని మాట్లాడుతుంది.. అక్షయ కూడా అవని నిజంగానే వెళ్లి తప్పు చేసిందా లేదా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు అవని ఎప్పుడూ ఎవరితో ఎలా మాట్లాడాలో తనకి బాగా తెలుసు అలాంటి అవినీతి ఎందుకు తప్పు చేస్తుంది అని పార్వతి అంటుంది అప్పుడే వచ్చిన శ్రేయ కూడా అవని అక్క ఏ తప్పు చేయదు కానీ ఆ పల్లవి గురించి మనకు తెలుసు కదా మళ్లీ అక్క ఎందుకు అక్కడికి వెళ్ళింది అని అంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అవని ఆ పల్లవికి వార్నింగ్ ఇచ్చి వచ్చాను అని చెప్తుంది. భరత్ మాత్రం కమల్ ని ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు కానీ భానుమతి ఏం చేస్తావు నా మనవడిని చంపేస్తావా అని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :సీరియల్ హీరోయిన్లకు డిమాండ్ ఎందుకు ఎక్కువ..? ఇదే నిజమా..?

Related News

ఇంజినీర్ జాబ్ మానేసి రాపిడో డ్రైవర్ పనికి.. ఇప్పుడు నెలకు రూ.1.2 లక్ష ఆదాయం

Karthika Deepam 2 Serial Today Episode October 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: వంట మనిషిగా సుమిత్ర – మాలినికి దడ పుట్టించిన జ్యోత్స్న

రాజంపేటలో విచిత్ర దొంగతనం.. గాలిలో తేలుతూ వచ్చి రూ. 35 వేలు దోచేసిన లూటీ మాస్టర్!

నెల్లూరులో కూటమికి షాక్.. జనసేన ఏంటో చూపిస్తాం అంటున్న శివశంకర్!

Karthika Deepam 2 Serial Today Episode October 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని గురించిన నిజం జ్యోత్స్న సూరజ్ కు చెప్తుందా..?            

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

Big Stories

Advertisement
×