BigTV English

Meena Sagar: ‘మా’ ప్రెసిడెంట్ పై మీనా ప్రశంసల వర్షం.. ఎందుకో తెలుసా.. ?

Meena Sagar: ‘మా’ ప్రెసిడెంట్ పై మీనా ప్రశంసల వర్షం.. ఎందుకో తెలుసా.. ?

Meena Sagar: మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఈ మధ్య ఒక సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. నటీనటులపై యూట్యూబ్ లో అసభ్యకరమైన థంబ్ నెయిల్స్ పెట్టి అసత్య వార్తలను ప్రచారం చేయడమే కాకుండా, అశ్లీల ఫోటోలకు నటీనటుల ఫోటోలను జోడించి మీమ్స్ చేసిన ఛానెల్స్ పై మంచు విష్ణు కొరడా ఝుళిపించాడు.


ఒకటి కాదు రెండు కాదు దాదాపు 18 ఛానెల్స్ పై వేటు వేసినట్లు మా అధికారికంగా తెలిపింది. దీంతో సోషల్ మీడియా లో కూడా నటీనటులపై ట్రోల్స్ తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. ఇక మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా సీనియర్ నటి మీనా సైతం మంచు విష్ణును ప్రశంసలతో ముంచెత్తింది.

” తప్పుడు వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై యాక్షన్ తీసుకున్న మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నటీనటులు.. నెగెటివ్ కామెంట్స్ ను, ట్రోలింగ్ ను ఎదుర్కొంటూ నిత్యం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని అందరం కలిసి ఎదుర్కొవాలి. సినిమా ఇండస్ట్రీ సమగ్రత కోసం మీరు చూపుతున్న ఈ అంకిత భావం చాలా గొప్పది.. అభినందనీయం. ఇలాంటి ఎన్నో మంచి నిర్ణయాలు భవిష్యత్ లో మరెన్నో తీసుకుంటారని ఆశిస్తున్నాను” అని రాసుకొచ్చింది.


మీనా ఇలా రియాక్ట్ అవ్వడానికి ఒక ప్రధాన కారణం ఉంది. మీనా భర్త సాగర్ కొన్నేళ్ల క్రితం చనిపోయిన విషయం తెల్సిందే. మీనా భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే.. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ .. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందని, హీరో ధనుష్ తో ఆమె ఎఫైర్ నడుపుతుందని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలను ప్రచారం చేశారు. ఈ వార్తల వలన మీనాతో పాటు ఆమె కుటుంబం కూడా ఎంతో సఫర్ అయ్యింది.

తాను రెండో పెళ్లి చేసుకోబోయేది లేదని, ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదని ఆమె స్పష్టం చేసింది. ఇలా ట్రోలింగ్ వలన ఇబ్బందిపడిన నటీమణుల్లో మీనా కూడా ఒకరు కాబట్టి ఆమె ఇలా మంచు విష్ణు చేసిన పనికి సపోర్ట్ గా నిలబడింది అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మీనా వరుస సినిమాలతో బిజీగా మారింది.

Related News

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big Stories

×