BigTV English

Nayanthara : నన్ను క్షమించండి.. ‘అన్నపూరణి’ వివాదంపై నయనతార పోస్ట్‌..

Nayanthara : ‘అన్నపూరణి’ వివాదంపై నయనతార స్పందించి క్షమాపణలు చెప్పారు. అగ్రకథానాయిక నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). నీలేశ్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం వివాదాస్పదమైంది. తాజాగా దీనిపై నయనతార స్పందించారు.

Nayanthara : నన్ను క్షమించండి.. ‘అన్నపూరణి’ వివాదంపై నయనతార పోస్ట్‌..
Nayanthara latest news

Nayanthara latest news(Today tollywood news):


‘అన్నపూరణి’ వివాదంపై నయనతార స్పందించి క్షమాపణలు చెప్పారు. అగ్రకథానాయిక నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). నీలేశ్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం వివాదాస్పదమైంది. తాజాగా దీనిపై నయనతార స్పందించారు.

‘అన్నపూరణి’ సినిమాను ప్రజల్లోకి మంచి ఆలోచనను తీసుకెళ్లేందుకు రూపొందించామని బరువెక్కిన హృదయంతో చెప్పారు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలియజేసేందుకే ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. ఈ ప్రయత్నంలో తెలియకుండానే కొందరి మనసులను గాయపరిచామని ఆవేదన వ్యక్తం చేశారు. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చినా.. సినిమాను ఓటీటీ వేదిక నుంచి తొలగిస్తారని అస్సలు ఊహించలేదన్నారు.


తమ చిత్ర బృందం ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదని నయనతార ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఎవ్వరి మనోభవాలను గాయపర్చాలనుకోలేదన్నారు. అలా జరిగితే దయచేసి క్షమించాలన్నారు. అన్న పూరణి చిత్ర ప్రధాన ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదన్నారు. 20 ఏళ్ల కెరీర్‌లో సానుకూలతను వ్యాప్తి చేయాలనే చూశానని ఆమె పేర్కొన్నారు.

నయనతార 75వ చిత్రంగా ‘అన్నపూరణి’ విడుదలైంది. ‘ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. సంప్రదాయ కుటుంబంలో జన్మించిన అమ్మాయి.. చెఫ్‌గా ఎదగాలనే తన కలను ఎలా సాకారం చేసుకుంది? అనే కథాంశంతో దీనిని రూపొందించారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాగా.. ఇందులోని కొన్ని సన్నివేశాలు మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి తొలగించారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×