BigTV English

Payal Rajput Birthday Special : పాయల్ రాజ్‌పుత్ బర్త్ డే స్పెషల్

Payal Rajput Birthday Special  : పాయల్ రాజ్‌పుత్ బర్త్ డే స్పెషల్

Payal Rajput Birthday Special : “ఆర్ఎక్స్” 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా బ్యూటీ పాయల్ రాజపుత్. పంజాబ్ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది . ఈ అమ్మడు తన బోల్డ్ అందాలతో స్క్రీన్ అంత షేక్ చేసింది . కేవలం పాయల్ అందాలే “ఆర్ఎక్స్” 100 రేంజ్ పెంచేసాయి అనడం లో అతిశయోక్తి లేదు.


సక్సెస్ అయిన తరవాత జర్నీ గురించి పెద్దగా ఆలోచించరు .. కానీ ఈ విజయం సాధించే క్రమంలో పడిన కష్టాలు మాత్రం జీవితాంతం అలాగే గుర్తిండి పోతాయి . గెలుపు కోసం జీవితంలో చేసిన యుద్ధం అనేది మనతో పాటే ఉంటుంది. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ విషయం ఇదే జరిగింది.డిసెంబర్ 5న ఈమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పాయల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ..

2010లో టెలివిజన్ సీరియల్‌తో నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్ రాజ్‌పుత్ 2017లో Channa Mereya అనే పంజాబీ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది . తెలుగులో తొలి చిత్రం కార్తికేయ హీరోగా నటించిన ‘RX100’ మూవీ లో గ్లామర్ పాత్రలతో కుర్రకారును ఆకట్టుకుంది .


బాలకృష్ణ హీరోగా నటించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో జయసుధ పాత్రలో నటించిన పాయల్ రాజపుత్ ,తేజ దర్శకత్వంలో కాజల్, బెల్లంకొండ హీరో హీరోయిన్లుగా నటించిన ‘సీత’లో ఐటెం సాంగ్‌లో మెరిసింది . గతేడాది బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వెంకీ మామ’ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ సరసన మెరిసింది. రవితేజ సరసన ‘డిస్కోరాజా’ లో ముఖ్యపాత్రలో నటించింది .

తెలుగు, హిందీతో పాటు తమిళంలో వరుస ఆఫర్లు పట్టేస్తోన్న పాయల్ రాజ్‌పుత్ పంజాబీలో తొలి సినిమాకు గాను ఉత్తమ నూతన నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది . తాజాగా మంగళవారం మూవీ తో ప్రేక్షకులను అలరించింది . వరస సినిమాలు చేసుకుంటూ ఇప్పుడు బిజీ అయిపోయింది ఈ భామ. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఐటం సాంగ్స్‌లో హాట్ షోతో పిచ్చెక్కిస్తుంది పాయల్ రాజ్‌పుత్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×