E-Paper
Advertisement

Payal rajput – Rakshana: పాయల్ పాప కొత్త సినిమా టైటిల్ ఖరారు.. ఈ సారి నో రొమాన్స్.. ఓన్లీ యాక్షన్

Payal rajput – Rakshana: పాయల్ పాప కొత్త సినిమా టైటిల్ ఖరారు.. ఈ సారి నో రొమాన్స్.. ఓన్లీ యాక్షన్
Advertisement

Payal rajput – Rakshana: నటి పాయల్ రాజ్ పుత్.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా. ఈ మూవీతో తెలుగు ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్ము. తన ఫస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తొలి సినిమాలో లిప్ కిస్ సీన్లతో రెచ్చిపోయింది. దీంతో యూత్‌లో క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఒక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఇంపాక్ట్ ఇప్పటికీ తగ్గలేదు. లవ్, రొమాన్స్, ఎమోషన్స్ వంటి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసింది.

ఇక తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న పాయల్ రాజ్ పుత్.. ఆ తర్వాత పలు సినిమాలు తీసి ప్రేక్షకుల్ని అలరించింది. గ్లామరస్ హీరోయిన్, లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే పలు సినిమాలతో అదరగొట్టిన పాయల్ గతేడాది మరో సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తన మొదటి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’తో హిట్ అందించిన దర్శకుడు అజయ్ భూపతితో రెండవ సినిమా ‘మంగళవారం’ చేసి మరో హిట్ అందుకుంది.

Advertisement

థ్రిల్లింగ్, హారర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ రెస్పాన్స్‌తో సినీ ప్రియుల్ని అలరించింది. ముఖ్యంగా ఇందులోని హారర్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఇందులో కూడా పాయల్ ఓ సాంగ్‌లో రొమాంటిక్ సీన్లతో ఆకట్టుకుంది. ఒక్క చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఊహించని కలెక్షన్లను నమోదు చేసింది.

Also Read: పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’ మూవీ అరుదైన రికార్డ్.. ఏ హీరోకి ఇది సాధ్యం కాదు..!

Advertisement

అయితే ఇప్పటి వరకు రొమాంటిక్ సీన్లు, గ్లామర్ హీరోయిన్ రోల్స్‌లో అదరగొట్టేసిన పాయల్ ఇప్పుడు రూట్ మార్చింది. ఈ సారి నా రూటే సపరేటు అంటోంది. ఇందులో భాగంగా ఓ మూవీ చేస్తుంది. అయితే అందులో ఎలాంటి గ్లామర్ లేదు. ఎలాంటి రొమాన్స్ లేదు. ఈ సారి ఏకంగా యాక్షన్ మోడ్ లోకి దిగింది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది.

ఇందులో భాగంగా ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వంలో ‘రక్షణ’ అనే మూవీ చేస్తుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుంది. ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో రాజ్‌పుత్ పోలీస్ డ్రెస్‌లో కొత్తగా కనిపించి అదరగొట్టేసింది.

ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టింగ్ మిస్టరీ డ్రామా అని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో రోషన్, మానస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ లైఫ్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్‌ను వెల్లడించనున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×