Challenge Vote: ప్రజాస్వామ్మ దేశంలో ఓటుకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడే అమూల్యమైన సాధనం ఓటు. ఎన్నికల సమయంలో సాధారణ ఓటుతో పాటు ఛాలెంజ్ ఓటు గురించి కూడా వినబడుతూ ఉంటుంది. ఇంతకీ ఛాలెంజ్ ఓటు అంటే ఏమిటి.. దాన్ని ఎవరు వేస్తారో తెలుసుకుందామా.
తన ఒక్క ఓటుతో దేశ భవిష్యతు మారుతుందా.. అని ఆలోచించే వారు లేకపోలేదు. కానీ అనేక సందర్బాల్లో ఒక్క ఓటుతో వివిధ పార్టీల ఏంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందండి నెలకొంది. అనేక ప్రాంతాల్లో ఎన్నికల్లో అవకతవకలు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఓటు కోల్పోతే తిరిగి తమ ఓటు హక్కును పొందడమే ఛాలెంజ్ ఓటు.
ఒకరి ఓటు మరొకరు వేసిన సందర్భంలో అసలు వ్యక్తి తిరిగి పోలింగ్ కేంద్రానికి వస్తే ఛాలెంజ్ ఓటు తెరపైకి వస్తుంది. కొన్ని సందర్బాల్లో దొంగ ఓట్లు వేయడం కూడా మనం చూస్తుంటాం. దొంగ ఓటు కారణంగా ఓటు కోల్పోయిన వారు, వారి ఓటు గురించి ఛాలెంజ్ చేయవచ్చు. ఓటర్ పోలింగ్ కేంద్రానికి వెళ్లే సరికి అతడి పేరు జాబితాలో లేకపోతే ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు చూపించి సెక్షన్ 49ఏ క్రింద ఛాలెంజ్ ఓటు వినియోగించుకోవచ్చు.
Also Read: రేపు ఏ ఏ రాష్ట్రాలల్లో ఎన్నికలు జరగనున్నాయి..? ఎంతమంది పోటీ చేస్తున్నారంటే..?
ఒక వేళ పోలింగ్ బూత్ లోకి వచ్చిన వ్యక్తి ఓటరు జాబితాలో ఉన్న పేరుకు సరిపోక అధికారులకు అనుమానం కలిగితే ఓటరు రూ.2 చెల్లించి సవాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓటరు వయసు, తండ్రి పేరు, గుర్తింపు కార్డు వివరాలను తీసుకొని ప్రిసైడింగ్ అధికారి విచారణ చేపడతారు. ఒక వేళ బోగస్ అని తేలితే అతడిపై ఫిర్యదు చేసి పోలీసులకు అప్పగిస్తారు. ఒక వేళ సరియైన వివరాలు అని రుజువైతే అతడిని ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు.