BigTV English
Advertisement

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’ మూవీ అరుదైన రికార్డ్.. ఏ హీరోకి ఇది సాధ్యం కాదు..!

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’ మూవీ అరుదైన రికార్డ్.. ఏ హీరోకి ఇది సాధ్యం కాదు..!


Payal Rajput: నటి పాయల్ రాజ్ పుత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మంగళవారం’. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకాభిమానులు అలరించింది.

స్మాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ.ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. ముఖ్యంగా ఈ మూవీకి అజనీష్ లోక్ నాథ్ అందించిన మ్యూజిక్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతోపాటు శివంద్ర దాశరధి విజువల్స్ ఈ మూవీకి బలంగా నిలిచాయి.


బోల్డ్ కథాశంతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ భారీ రెస్పాన్స్‌తో పాటు కలెక్షన్లను కూడా బాగానే నమోదు చేసింది. కాగా థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఓటీటీలో కూడా తన హవా చూపించింది. ఓటీటీ ఆడియన్స్ కూడా ఈ మూవీకి మంచి మార్కులే వేశారు.

READ MORE: మంగళవారం సినిమాకు అవార్డుల పంట.. ఉత్తమ నటిగా పాయల్

ఇక ఇటీవల టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అక్కడ కూడా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించి సూపర్ డూపర్ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఏ ఒక్క పెద్ద హీరో సినిమాకు దక్కని రేటింగ్‌తో దూసుకుపోయింది. తాజాగా ఈ మూవీ 8.3 టీఆర్పీతో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా ఈ మూవీకి ఇంతటి ప్రేక్షకాదరణ రావడంతో దర్శకుడు అజయ్ భూపతి, నిర్మాతలు స్వాతి రెడ్డి, సురేష్‌లు ఆనందం వ్యక్తం చేశారు. తమ చిత్రాన్ని ఇంతలా ఆదరించిన ఆడియన్స్‌కు దన్యవాదాలు తెలిపారు.

కాగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ – దర్శకుడు అజయ్ భూపతి కలిసి ఇదివరకే చేసిన ‘ఆర్ ఎక్స్ 100’ మూవీ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం ద్వారా వీరిద్దరూ కలిసి మళ్లీ అద్భుతమైన హిట్‌ను అందుకున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×