BigTV English

Pooja Hegde: బుట్టబొమ్మకు బంపరాఫర్.. స్టార్ హీరోతో రొమాన్స్..!

Pooja Hegde: బుట్టబొమ్మకు బంపరాఫర్.. స్టార్ హీరోతో రొమాన్స్..!

Pooja Hegde: ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్‌తో బుట్టబొమ్మగా పేరు పొందిన టాలీవుడ్ టాల్ బ్యూటీ పూజా హెగ్డేకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. చేసిన సినిమాలన్నీ బెడిసికొడుతుండటంతో అమ్మడుకి ఆఫర్లు కరువయ్యాయి. గత రెండేళ్ల నుంచి ఈ ముద్దుగుమ్మ ఎలాంటి సినిమాల్లోనూ నటించలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు.


అయితే ఈ ఏడాది రిలీజ్ అయిన ‘గుంటూరు కారం’ మూవీలో మహేశ్ బాబుకు జోడీగా నటించాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆమె ఆ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో పూజా ప్లేస్‌లో యంగ్ బ్యూటీ శ్రీలీలను తీసుకున్నారు. ఇక ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న ఈ అమ్మడికి ఇప్పుడు ఎలాంటి సినిమా ఆఫర్లు రాకపోవడంతో పూజా పాప కూడా నిరాశలో ఉంది.

అయితే ప్రస్తుతం ఈ టాల్ బ్యూటీ కెరీర్ అయిపోయిందని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ బుట్టబొమ్మకు తాజాగా ఓ సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి జోడీగా నటించే ఛాన్స్‌ను పూజా కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు.


Also Read: పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ ఇతడేనా?.. వైరల్ అవుతున్న వీడియో

శివ దర్శకత్వంలో ‘కంగువ’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో నటుడు సూర్య డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆసక్తి రేకెత్తించాడు. అయితే ఈ మూవీ తర్వాత తన కెరీర్‌లో 44వ చిత్రాన్ని చేసేందుకు సూర్య రెడీ అయ్యాడు. తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో చేయనున్నాడు.

ఈ చిత్రాన్ని సూర్య ఓన్ నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కార్తీక్ సుబ్బరాజ్ కలిసి నిర్మించనున్నారు. దీనిపై ఇటీవల అఫీషియల్ అప్డేట్ కూడా మేకర్స్ అందించారు. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు. అయితే ఈ మూవీలో పూజా పాప ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇందులో సూర్యకు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తే బాగుంటుందని మేకర్స్ అనుకున్నారట.

త్వరలో దీనిపై మేకర్స్ ఓ అఫీషియల్ అప్డేట్ రివీల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఇన్ని రోజుల పూజా నిరీక్షణకు ఇప్పుడు తెరపడినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా స్టార్ హీరోతో నటించే ఆఫర్ కొట్టేసింది. మరి ఈ సినిమాతో అయినా ఆమె కెరీర్ టర్న అవుతుందో లేదో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×