BigTV English

Pooja Hegde: పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ ఇతడేనా?.. వైరల్ అవుతున్న వీడియో

Pooja Hegde: పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ ఇతడేనా?.. వైరల్ అవుతున్న వీడియో
pooja hegde latest news
pooja hegde

Pooja Hegde latest news(Latest tollywood news and gossips): ఒకానొక సమయంలో టాలీవుడ్‌ని ఒక ఊపు ఊపేసింది టాల్ బ్యూటీ పూజా హెగ్డే. స్టార్ హీరోల సరసన హీరయిన్‌గా నటించి ఓ వెలుగు వెలిగింది. మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ వంటి స్టార్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.


అయితే ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ జోరు తగ్గిపోయింది. వరుసగా ఫ్లాపులు వెంటాడటంతో ఆఫర్లు కరువయ్యాయి. ఆ మధ్య ఒకటి రెండు ఛాన్సులు వచ్చినా.. ఈ ముద్దుగుమ్మ రిజక్ట్ చేసింది. అంతేకాకుండా ఇటీవల మహేశ్ బాబుతో గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ వచ్చింది. కానీ అనివార్య కారణాల వల్ల మళ్లీ ఈ సినిమా నుంచి తప్పుకుంది.

ఇక తెలుగులో ఆఫర్లు కరువవ్వడంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన లక్‌ను పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసింది. కానీ అదృష్టం కలిసి రాలేదు.


Also Read: చిరంజీవి ఇలాంటి సినిమాలు చూస్తాడా.. అస్సలు నమ్మలేరు

గతేడాది స్టార్ హీరో కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో ఓ మూవీ చేసింది. ఈ మూవీ మంచి హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా మిగిలింది.

అలాగే కోలీవుడ్‌లో కూడా స్టార్ హీరో విజయ్‌తో ‘బీస్ట్’ మూవీ చేసింది. ఇది కూడా బెడిసి కొట్టింది. ఇక సినిమా అవకాశాల కోసం సతమతమవుతున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన అందమైన ఫొటోలను షేర్ చూస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది.

హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్‌ను హీటెక్కిస్తూ ఉంటుంది. ఇకపోతే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. పూజాహెగ్డే బాయ్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రసారం సాగుతోంది. గత కొన్నేళ్లుగా పూజా పాప బాయ్ ఫ్రెండ్ ఎవరనే దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

Also Read: త్వరలో జబర్దస్త్ యాంకర్ రష్మి పెళ్లి.. జాతకాలు కూడా కలిసాయి.. వరుడు ఎవరంటే..?

ఆ మధ్య తారా సుతారియ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ రోహన్ మెహ్రాతో పూజా చాలాసార్లు కనిపించింది. దీంతో వీరిద్దరూ ప్రేమాయణం సాగిస్తున్నారని అంతా అనుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ కేవలం స్నేహితులు మాత్రమేనని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరి గురించి వార్తలు బయటకొచ్చి వైరల్ అవుతున్నాయి.

అందుకు కారణం ఒక వీడియో. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. అందులో పూజా హెగ్డేతో పాటు మరోవ్యక్తి ఉన్నాడు. దీంతో అతను పూజా హెగ్డే బాయ్ ఫ్రెండా?.. అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. ఆ వీడియోలో పూజా కూడా సిగ్గు పడుతూ కనిపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×