BigTV English

Taiwan lawmakers fighting: రణరంగంగా తైవాన్ పార్లమెంట్, సభ్యల మధ్య ఫైటింగ్, ఆపై పరుగులు

Taiwan lawmakers fighting: రణరంగంగా తైవాన్ పార్లమెంట్, సభ్యల మధ్య ఫైటింగ్, ఆపై పరుగులు

Taiwan lawmakers fighting(Latest world news):

చట్టసభ్యులకు పార్లమెంటు దేవాలయం లాంటిది. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చక్కటి వేదిక కూడా. బిల్లులు ఆమోదించే విషయంలో పాజిటివ్, నెగిటివ్ అనే అంశాలు ఉంటాయి. అధికార పార్టీ.. విపక్ష సభ్యులకు గౌరవం ఇస్తూ బిల్లులను పాస్ చేయించాల్సిన బాధ్యత ప్రధానంగా వారిపై ఉంది.. ఉంటుంది కూడా. ఎంతో హుందాగా వ్యవహరించాల్సి చట్టసభ్యులు విచక్షణ కోల్పోతున్నారు. ఆవేశాలకు లోనవుతున్నారు. ఫలితంగా అధికార-విపక్ష సభ్యుల మధ్య ఫైటింగ్ వంటి సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి.


సొసైటీ మారుతోంది. అలాగని నేతలు మారుతున్నారా? అంటే అదొక క్వచ్ఛన్ మార్క్. ఆ తరహా ఘటనలు ఒకప్పుడు జరిగేవి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్, వైరల్ చేయడానికి సోషల్‌మీడియా ప్రబలంగా ఉన్న ఆ రోజుల్లోనూ ఆ తరహా ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా తైవాన్ పార్లమెంట్‌లో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ బిల్లు విషయంలో అధికార- విపక్షాల మధ్య మాటల యుద్ధం చివరకు గాలివానగా మారి ఫైటింగ్‌కు దారి తీసింది. సభలో సభ్యులు ప్రవర్తించిన సన్నివేశాలు సోషల్‌మీడియాలో గిరగిరా తిరిగే స్తున్నాయి. ఇంతకీ అసలేం జరిగింది? ముష్టి ఘాతాల వెనుక ఏం జరిగిందంటే..

శుక్రవారం తైవాన్ పార్లమెంట్‌ ముందుకు ఓ బిల్లు వచ్చింది. తప్పుడు ప్రకటనలు ఇచ్చే సభ్యులపై నేరాభియోగాలు మోపేందుకు తీసుకొచ్చిన చట్టం అది. ఈ బిల్లుపై ప్రజాప్రతినిధుల ఛాంబర్‌లో సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బిల్లు పెట్టే సమయంలో అంతా సర్దుకుంటుందని భావించింది అధికార పార్టీ. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఈ సందర్భంగా విపక్షాలు కొన్ని డిమాండ్లు చేశాయి. ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలను సమీక్ష చేసేందుకు కొంత సమయం కావాలని పట్టుబట్టాయి.


బిల్లు సందర్భంగా ఎంపీలు పరస్పరం దాడులకు దిగారు. తోటి సభ్యుల చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే గల్లీలో జరిగే గొడవ మాదిరిగా తయారైంది సభ. కొందరు స్పీకర్ టేబుల్‌పైకి ఎక్కి పత్రాలు తీసుకున్నారు. మరికొందరు దాన్ని వారించే క్రమంలో ముష్టిఘాతాలకు దిగారు. అధికార ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ఆమోదం పొందకుండా ఉండేందుకు సంబంధించిన పత్రాలను పట్టుకుని ఓ సభ్యుడు బయటకు పరుగెత్తారు. దీనికి సంబంధించిన దృశ్యాలు తైవాన్ మీడియాలో ప్రసారమయ్యాయి. ఇప్పుడు వైరల్ అయ్యాయి.

ALSO READ: బంపరాఫర్.. ఇలా చేసినవారికి.. దుబాయ్‌లో 10 ఏళ్లు ఉండే ఛాన్స్!

విషయం ఏమిటంటే సభ్యుల్లో చాలావరకు యంగ్ ఎంపీలున్నాయి. వారి మధ్య ఆవేశాలు ఫైటింగ్‌కు దారితీసిందని చెబుతున్నారు. అదే కాస్త వయస్సు పైబడిన ఎంపీలయితే ఆ తరహా సన్నివేశాలకు ఛాన్స్ ఉండవని అంటున్నారు. చాలా దేశాల్లో 60 ఏళ్లు పైబడినవారే చట్ట‌సభలకు ఎన్నికవుతారు. అందుకు కారణం ఇదేనని అంటున్నారు. మొత్తానికి చట్ట సభల సభ్యులకు మార్పు ఎప్పుడొస్తుందో చూడాలి.

 

 

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×