E-Paper
Advertisement

R.Subbalakshmi: చిత్రపరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ నటి ఆర్. సుబ్బలక్ష్మి కన్నుమూత

R.Subbalakshmi: చిత్రపరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ నటి ఆర్. సుబ్బలక్ష్మి కన్నుమూత
Advertisement

R.Subbalakshmi: సౌత్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. సీనియర్ నటి ఆర్. సుబ్బలక్ష్మి (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొచ్చిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం (నవంబర్ 30) రాత్రి తుదిశ్వాస విడిచారు. సుబ్బలక్ష్మి మరణించిన విషయాన్ని ఆమె మనవరాలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. నా బలం, మా అమ్మమ్మను నేను కోల్పోయానంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ చేసింది.

కాగా.. సుబ్బలక్ష్మి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మొత్తం 70కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె కల్యాణ రాముడు సినిమాలో, నాగచైతన్య-సమంత జంటగా నటించిన తొలిసినిమా ఏమాయ చేశావె లో సమంతకు అమ్మమ్మగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిగా విజయ్ దళపతి నటించిన బీస్ట్ సినిమాలో సుబ్బలక్ష్మి కనిపించారు. బుల్లితెరపై కూడా ఎన్నో సీరియల్స్ లో నటించారామె.

Advertisement

సుబ్బలక్ష్మి సినీ పరిశ్రమలోకి రాకముందు జవహర్ బాలభవన్ లో సంగీత, నాట్య శిక్షకురాలిగా పనిచేశారు. 1951లో ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగినిగా సేవలందించి.. తొలి లేడీ కంపోజర్ గా రికార్డు సృష్టించారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పనిచేశారు. ఆర్. సుబ్బలక్ష్మి ఇక లేరని తెలిసి సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×