E-Paper
Advertisement

HBD Sai Pallavi- Thandel: హ్యాపీ బర్త్ డే సాయి పల్లవి: తండేల్ మూవీ నుంచి లవ్లీ వీడియో రిలీజ్!

HBD Sai Pallavi- Thandel: హ్యాపీ బర్త్ డే సాయి పల్లవి: తండేల్ మూవీ నుంచి లవ్లీ వీడియో రిలీజ్!
Advertisement

Birthday Wishes to Actress Sai Pallavi From Thandel Team: అందం, యాక్టింగ్, డ్యాన్స్ ఇలా అన్ని కలగలిపి మిక్సీలో కొడితే ఎలా ఉంటుందో అదే సాయి పల్లవి. ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన డ్యాన్స్, వాయిస్‌తో కుర్రకారును ఫిదా చేసింది. భానుమతి సింగిల్ పీస్ అనే డైలాగ్‌తో సినీ ప్రియుల గుండెల్లో నిలిచిపోయింది. చేసిన ఏ సినిమాలో అయినా నో బోల్డ్ సీన్స్, నో గ్లామర్ షోస్. ఇవేమి లేకుండానే సినిమాల్లో దూసుకుపోతుంది.

భారీ రెమ్యూనరేషన్ ఇస్తామని నిర్మాతలు అడిగినా.. ఏ మాత్రం ఆలోచించకుండా నో చెప్పేస్తుంది ఈ బ్యూటీ. అయితే సినిమా ఆఫర్లను దక్కించుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో అక్కినేని నాగచైతన్యతో ఓ మూవీ చేస్తుంది. ‘కార్తికేయ2’ మూవీ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ‘తండేల్’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది.

Advertisement

అయితే నేడు సాయి పల్లవి బర్త్ డే. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే వీడియోను రిలీజ్ చేశారు. అందులో సాయి పల్లవి నటించిన ఫస్ట్ మూవీ ఫిదాలోని భానుమతి ఒక్కటే పీస్ అనే డైలాగ్‌తో వీడియో స్టార్ట్ అయింది. ఆ తర్వాత తాను నటించిన విరాట పర్వంలోని తన పేరును చెప్తుంది. అలాగే శ్యామ్ సింగ్‌రాయ్ లోని తన క్యారెక్టర్ గురించి తెలుపుతుంది.

Also Read: సాయిపల్లవి ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. అప్డేట్స్ వచ్చేస్తున్నాయి

Advertisement

అంతేకాకుండా మారీ లోని మాస్ లుక్‌లో నుంచి కూడా ఓ క్లిప్ కట్ చేసి చూపించారు. మొత్తంగా అన్ని సినిమాల నుంచి ఒక్కోక్క క్లిప్ కట్ చేసి చివరికి తండేల్ లోని కొన్ని సీన్లను చూపించారు. అందులో మొదటిగా బుజ్జితల్లే అనే మాట వినిపిస్తుంది. ఆ సమయంలో సాయి పల్లవి చిరునవ్వు సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. మొత్తంగా రిలీజ్ చేసిన వీడియోలో సినిమా షూటింగ్‌లో సాయి పల్లవి చేసిన అల్లరి, యాక్టింగ్ మొత్తాన్ని చూపించారు. మొత్తంగా ఈ వీడియో చాలా అందంగా, క్యూట్ ఉంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతుంది.

ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పలుగా ఉన్నాడు. త్వరలో ఈ మూవీ అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×