Big Stories

AP Elections Survey 2024: రాయలసీమలో ఆ లీడర్లకు ఓటమి తప్పదా..?

AP Elections Survey on Chittur Assembly Constituency: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్డీఏ కూటమి నేతల స్పీడ్ పీక్ స్టేజ్‌కి చేరింది. పోలింగ్ గుడువు దగ్గరపడటంతో పార్టీల అధినేతలు వాడివేడి ప్రసంగాలతో ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. క్యాడర్‌లో జోష్ పెంచుతూ .. సామాన్య ఓటర్లను సైతం అలోచింపచేసేలా ప్రసంగాలు చేస్తున్నారు. తాజాగా తిరుపతిలో ప్రసంగించిన జనసేన, టీడీపీ అధినేతలు చేసిన ప్రసంగాల్లో  అప్పుడే గెలిచిపోయామన్న ధీమా కనిపించడం విశేషం. పొత్తు ధర్మం పాటిస్తూ .. సైకిల్ ఎక్కి గాజు గ్లాసు పట్టుకుని.. కమలాన్ని ముందు పెట్టుకోండని చంద్రబాబు పిలుపునిచ్చి  మిత్రపక్షాల శ్రేణుల్లో జోష్ నింపారు.

- Advertisement -

వైసీపీ ప్రభుత్వ హయాంలో సీమలో మిగతా జిల్లాలకంటే టీడీపీ ,జనసేన కార్యకర్తలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఎక్కువగా అనేక ఇబ్బందులు పడ్డారన్న అభిప్రాయం ఉంది. చంద్రబాబును టార్గెట్ చేసి టీడీపీని బలహీన పర్చాలనే ధ్యేయంతో అధికార పార్టీ పనిచేసిందన్న అరోపణలున్నాయి. దానికి తగ్గట్లే టీడీపీ ,జనసేన నేతలపై వందల కేసులు నమోదు అయ్యాయి. గత ఐదు సంవత్సరాలుగా జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో వారిపై దాడులు జరుగుతునే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ, జనసేనలు ఎన్నికల యుద్దానికి దిగడంతో జిల్లా రాజకీయం ఉత్కంఠభరితంగా మారింది

- Advertisement -

తాజా గా జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర స్థాయిలో అందర్నీ అకర్షిస్తున్నాయి. ముఖ్యంగా రాజంపేట నుంచి బిజెపి తరపున ఎంపీగా పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కూమార్ రెడ్డి గెలుపు ఓటములు అటుంచి తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి అండ్ కో పై విరుచుకు పడుతున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి విమర్శలకు దీటుగా బదులిస్తూ పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నాడని కౌంటర్లు వేస్తున్నారు. పెద్దిరెడ్డి ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైన వైరస్ అంటూ వారిచ్చే డబ్బులకు అశపడితే క్షణం సుఖం కోసంఎయిడ్స్ కొని తెచ్చుకున్నట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ సారి పెద్దిరెడ్డి రాజకీయ జీవితానికి చెక్ పెడతానని సవాల్ చేస్తున్నారు.

Also Read: మోదీ ధమ్కీ! జగన్ తుస్!!

ఇక తాజాగా తిరుపతిలో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతమైంది. ర్యాలీ సమయంలో కరెంటు తీసివేసినా వేలాది మంది నాయకులను అనుసరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుపతి నుంచి బయటకు పోయే కోడిబొచ్చుకు ప్రతి నెల 20 లక్షలు తండ్రి కొడుకులు వసూలు చేస్తున్నారని భూమన ఫ్యామిలీపై ఆరోపణలు గుప్పించారు. ఇంజనీరింగ్ సివిల్ పనులలో రెండు వందల కోట్లు కమీషన్ తీసుకున్నారని అది శ్రీవారి హుండా ఆదాయమని దానిని ఓట్లరకు పంచుతున్నారని అవి తీసుకున్న వారు తిరిగి శ్రీవారి హుండిలో వేయమని కోరారు. తిరుపతిలో కూటమి అభ్యర్ధులను గెలింపించి భూమన కరుణాకరరెడ్డి అరాచకాలకు చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు.

మరోవైపు తిరపతితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎన్టీఆర్, చిరంజీవిలను గెలిపించిన తిరుపతి ఓట్లు ఈ సారి కూటమి అభ్యర్ధులను అందలం ఎక్కిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: YS Sharmila Vs YS Avinash: కడప కోటలో గెలిచేదెవరు.. అవినాష్ కు ఓటమి తప్పదా?

తిరుపతి టూర్‌లో చంద్రబాబు నయా జోష్‌తో కనిపించడం విశేషం. ఆయనలో అప్పుడే గెలిచిపోయామన్న ధీమా కనిపించిందంటున్నారు. మరి ఆయనకు ఏ రిపోర్టులు అందాయో? ఏ లెక్కలు వేసుకుంటన్నారో కాని.. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల పర్యటనతో మిత్ర పక్షాల శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News