Big Stories

SRH Records in IPL 2024: హైదరాబాద్ సన్ రైజర్స్ విధ్వంసం.. బద్ధలైన రికార్డులు!

Sunrisers Hyderabad Team Records in IPL History: పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టు గా హైదరాబాద్ సన్ రైజర్స్ నిలిచింది. ఇప్పటికే రెండు సార్లు పవర్ ప్లే 6 ఓవర్లలో 100 పరుగులు దాటించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. లక్నోతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసంతో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి.

- Advertisement -

ఐపీఎల్ చరిత్రలో తక్కువ బంతుల్లోనే లక్ష్యం సాధించిన జట్టుగా  రికార్డ్ వచ్చింది. హెడ్, అభిషేక్ ఇద్దరూ కలిసి కేవలం 62 బంతుల్లోనే 166 పరుగుల లక్ష్యాన్ని కొట్టి పారేశారు. ఇప్పుడిదే నెంబర్ వన్ గా రికార్డ్ గా నిలిచింది. ఇంతకుముందు చూస్తే..

- Advertisement -

2022లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 116 పరుగుల లక్ష్యాన్ని 57 బంతుల్లోనే ఢిల్లీ ఛేదించింది. డేవిడ్ వార్నర్ (60*), ప్రథ్వీ షా (40) ఆడారు.

2008లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 155 పరుగుల లక్ష్యాన్ని 72 బంతుల్లోనే  డక్కన్ ఛార్జర్స్ ఛేదించింది. గిల్ క్రిస్ట్ 47 బంతుల్లో 109, లక్ష్మణ్ 26 బంతుల్లో 37 చేసి ఇద్దరూ నాటౌట్ గా నిలిచారు.

Also Read: ఆర్సీబీ దూకుడు.. నేడు పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్

ఐపీఎల్ చరిత్రలో 10 ఓవర్లలో హైదరాబాద్ సన్ రైజర్స్ 3 సార్లు  అత్యధిక పరుగులు చేసి రికార్డ్ సృష్టించింది. దీని తర్వాత ముంబై ఇండియన్స్ ఉంది.

2024  లక్నోతో తాజాగా జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులు చేసింది.

2024  ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో  సన్ రైజర్స్ 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.

Also Read: Virat Kohli vs Rilee Rossouw: పంజాబ్ కింగ్స్ బెంగళూరు మ్యాచ్.. న్యూటన్ థర్డ్ లా అప్లై చేసిన కోహ్లీ..

2024 లో హైదరాబాద్ లో సన్ రైజర్స్ వర్సెస్ ముంబై మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. అయితే ఇక్కడ 10 ఓవర్లు గడిచేసరికి సన్ రైజర్స్ 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఇదే మ్యాచ్ లో  సెకండ్ బ్యాటింగ్ కి వచ్చిన ముంబై కూడా ఇంతే ధీటుగా ఆడింది. తను కూడా 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.

మొత్తానికి ఐపీఎల్ 2024 సీజన్ మాత్రం… హైదరాబాద్ సన్ రైజర్స్ నామ సంవత్సరంగా పిలవచ్చు అని అందరూ అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News