E-Paper
Advertisement

Samantha: నేను విజయం సాధించిన తర్వాత.. ఆ విషయంలో చాలా భయపడ్డాను: సమంత

Samantha: నేను విజయం సాధించిన తర్వాత.. ఆ విషయంలో చాలా భయపడ్డాను: సమంత
Advertisement

Samantha: ఇండస్ట్రీలో ఎంతో కాలంగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూ వస్తున్న నటీమణులలో నటి సమంత ఒకరు. ఈ అందాల బ్యూటీ ఓ వైపు సినిమాలతో పాటు తన పర్సనల్ విషయాలను తరచూ సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇటీవల సామ్ టేక్ 20 అనే పాడ్ కాస్ట్‌ను స్టార్ట్ చేసింది. ఇందులో సామ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధిచిన కొన్ని విషయాలను పంచుకుంది. చిన్నప్పటి నుంచి తన దృష్టి సక్సెస్‌పైనే ఉందని సమంత తెలిపింది. అయితే ఈ ఎపిసోడ్‌లో సమంతా వెల్‌నెస్ కోచ్.. పోషకాహార నిపుణుడు అల్కేష్ షరోత్రితో కొన్ని పరిస్థితులలో తన శరీరంలో సంభవించే మార్పులు, సమస్యల గురించి మాట్లాడింది.

Advertisement

బాగా అలసిపోయినపుడు విశ్రాంతి లేకపోవడం వల్ల తన బలహీనతకు సంకేతాలని ఆమె నమ్మినట్లు తెలిపింది. తాను కేవలం 6 గంటలు మాత్రమే నిద్రపోతానని పేర్కొంది. ఇక ఎంత అలసిపోయినా.. సినీ ఇండస్ట్రీలో 13 ఏళ్లు ఆగకుండా కష్టపడ్డానని తెలిపింది. ఇక తన బాల్యం గురించి మాట్లాడింది. తన బాల్యం విలాసవంతమైనది కాదని తెలిపింది.

Also Read: మొన్నేమో క్లివేజ్ షో.. ఇప్పుడేమో థైస్ షో.. అదిరిందమ్మా సమంత

Advertisement

తన చిన్నతనం నుంచే విజయంపై ఫోకస్ పెట్టానని చెప్పింది. తాను జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో తరచూ ఒత్తిడిని అనుభవించానని పేర్కొంది. అయితే ఆ లక్ష్యమే తనని విజయాన్ని సాధించడానికి తోడ్పడిందని తెలిపింది. దాంతోపాటు తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తాను ఇతరులతో పోల్చుకుంటూ విజయాన్ని సాధించడానికి ఎంతో శ్రమించానని చెప్పింది.

అలాగే ఎదుటివారిని సంతోషపెట్టడానికి తాను అవిశ్రాంతంగా పనిచేసినట్లు తెలిపింది. అందులో తన సొంత ఆలోచనలు, బావాలు, కోరికలు ముఖ్యమైనవి అని పేర్కొంది. అయితే తాను విజయం సాధించిన తర్వాత దానిని ఎక్కడ కోల్పోతానేమోనని చాలా భయపడినట్లు తెలిపింది. దీంతో వెంటనే తన నెక్స్ట్ పెద్ద విజయాన్ని వెతికే పనిగా పెట్టుకున్నానని చెప్పింది. కాబట్టి తాను తన కెరీర్ మొత్తం ఫ్లైట్‌లో లేదా ఫ్లైట్ మోడ్‌లోనే ఉన్నట్లు నమ్ముతానని ఈ ఎపిసోడ్‌లో చెప్పుకొచ్చింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×