BigTV English

Samantha: అతడితో పీకల్లోతు ప్రేమ.. సమంత రెండో పెళ్లి ఫిక్స్?

Samantha: అతడితో పీకల్లోతు ప్రేమ.. సమంత రెండో పెళ్లి ఫిక్స్?

Samantha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత(Samantha).. టైర్ -1 హీరోలతో పాటు టైర్ -2 హీరోల సరసన కూడా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా కథ బలమైనది అని నమ్మితే, ఎదుటి వ్యక్తికి గుర్తింపు లేకపోయినా సరే వారితో నటించగలిగే మనస్తత్వం ఆమెది. అందుకే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అందరికీ ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది సమంత. కెరియర్ పీక్స్ లో ఉండగానే, తన ప్రియుడు నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన నాలుగేళ్లకే బంధం కాస్త బీటలు బారి విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సమంత.. అదే సమయంలో ‘మయోసైటిస్’ అనే వ్యాధి బారినపడి ఇండస్ట్రీకి ఏడాది పాటు దూరమైంది. ఇక ఆ తర్వాత కోలుకున్న ఈమె ‘ఖుషీ’ సినిమా తోపాటు ‘సిటాడెల్ – హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


SVSC: గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న నాగార్జున.. అసలేమైందంటే..?

రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్..


అయితే ప్రస్తుతం టాలీవుడ్ కి దూరంగా ఉన్న ఈమె బాలీవుడ్ లోనే పలు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా మారిపోయింది. అందులో భాగంగానే ఇప్పుడు అక్కడ ‘రక్త్ బ్రహ్మండ్’ అని వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇకపోతే సమంత వృత్తిపరమైన జీవితం కాస్త పక్కన పెడితే .. వ్యక్తిగతంగా ఇప్పుడు బాలీవుడ్ లో ఎన్నో రూమర్స్ ఎదుర్కొంటోంది ఈ ముద్దుగుమ్మ. ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) తో సమంత డేటింగ్ లో ఉందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు కోడై కూస్తున్నాయి. అటు నాగచైతన్య.. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాల (Shobhita dhulipala) ను వివాహం చేసుకొని, కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు సమంతా కూడా రాజ్ నిడిమోరుతో ప్రేమ పడినట్లు సమాచారం.

రెండో పెళ్లికి సమంత సిద్ధమైందా..?

అసలు విషయంలోకి వెళ్తే.. నాగచైతన్య నుండి విడాకులు తీసుకున్న సమయం నుంచే సమంత ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇక ఈమె మొదటి హిందీ వెబ్ సిరీస్ అయిన ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ చేస్తున్న సమయంలో ఆ సిరీస్ దర్శకుడు రాజ్ తో ఈమెకు పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త స్నేహంగా మారిందట. అయితే ఇప్పుడు ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారిందని, ఇద్దరు డేటింగ్ చేసుకుంటున్నారని, అందుకు తగ్గట్టుగానే ఇద్దరు కలిసి చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు అంటూ బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు సమంత, రాజ్ నిడిమోరు ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లి వేడుకల్లో కూడా సందడి చేయడంతో.. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఆ రూమర్స్ కి ఇప్పుడు మరింత ఆజ్యం పోసినట్టయింది. ఇక అంతేకాదు సమంత ఎక్కడికి వెళ్తే అక్కడ రాజ్ కనిపించడంతో ఈ పుకార్లు మరింత విస్తృతంగా వినిపిస్తున్నాయని చెప్పవచ్చు. మొత్తానికైతే రాజ్ తో ప్రేమలో పడ్డ ఈమె.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని కూడా బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక రాజ్ దర్శకత్వంలో వచ్చిన సిటాడెల్ – హనీ బన్నీ వెబ్ సిరీస్లో చేసిన ఈమె.. ఇప్పుడు మళ్లీ రాజ్ దర్శకత్వంలో వస్తున్న ‘రక్త్ బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్ లో కూడా లీడ్ రోల్ పోషిస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×