Lack Of Sleep: మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. తగినంత ఆహారం ఎంత అవసరమో, నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్ర సరిగ్గా పోయినప్పుడు మాత్రమే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఎవరైనా ఒక రోజు సరిగ్గా నిద్ర పోకపోతే వారు రోజంతా అలసిపోయినట్లు ఉంటారు. అంతే కాకుండా నిరాశ చెందుతారు. నిద్ర సరిపడా లేకపోతే.. తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు కూడా వస్తాయి.
కాబట్టి.. ప్రతి ఒక్కరికీ తగినంత నిద్ర అవసరం. కానీ కొన్నిసార్లు పడుకోవాలని అనుకున్నా కూడా నిద్ర పట్టదు . నిద్ర లేకపోవడం వల్ల ఒక వ్యక్తి అనేక రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అంతే కాకుండా నాడీ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. 6 గంటల కన్నా తక్కువ నిద్రపోయే వ్యక్తి స్వల్పకాలిక జ్ఞాపకశక్తి కోల్పోయే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
తక్కువ నిద్రపోవడం వల్ల భవిష్యత్తులో జ్ఞాపకాలు ఏర్పడటం, వాటిని గుర్తుకు తెచ్చుకోవడం కష్టమవుతుంది. నిద్ర మెదడుపై ప్రభావం చూపుతుంది. స్వల్పకాలిక జ్ఞాపకశక్తి కోల్పోవడం అనే సమస్యను పట్టించుకోకపోతే.. అది దీర్ఘకాలికంగా జ్ఞాపకశక్తి కోల్పోవడానికి కారణం అవుతుంది. మరి ఇలా జరగకుండా ఉండాలంటే.. కొన్ని రకాల టిప్స్ తప్పకుండా పాటించాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్వల్పకాలిక జ్ఞాపకశక్తి కోల్పోవడం అంటే ఏంటి ?
స్వల్పకాలిక జ్ఞాపకశక్తి కోల్పోవడం అనేది ఒక నాడీ సంబంధిత పరిస్థితి. ఈ సమయంలో ఒక వ్యక్తి ఏమీ గుర్తుంచుకోలేడు. ఈ సమస్య కొంతకాలం ఉంటుంది. తరువాత మామూలైపోతుంది. స్వల్పకాలికంగా జ్ఞాపకశక్తి కోల్పోవడం వల్ల విషయాలను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అంతే కాకుండా అలసిపోయి అనారోగ్యంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. స్వల్పకాలిక జ్ఞాపకశక్తి లోపానికి నిద్ర లేకపోవడంతో సహా అనేక కారణాలు ఉంటాయి.
స్వల్పకాలిక జ్ఞాపకశక్తి కోల్పోవడానికి కారణాలు:
తగినంత నిద్ర లేకపోవడం:
శరీరం సజావుగా పనిచేయడానికి తగినంత నిద్ర అవసరం. నిద్ర లేకపోవడం వల్ల మెదడు విశ్రాంతి ఉండదు. దీనివల్ల అది అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి బలహీనపడటం జరుగుతుంది.
నిరాశ :
నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి, నిరాశకు గురయ్యే వ్యక్తులు స్వల్పకాలిక జ్ఞాపకశక్తి కోల్పోయే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా డిప్రెషన్ వల్ల విషయాలు గుర్తుంచుకోవడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది.
మెదడులో ఆక్సిజన్ లేకపోవడం:
నిద్ర లేకపోవడం వల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. దీని వల్ల వ్యక్తి జ్ఞాపక శక్తి కూడా చాలా ప్రభావితమవుతుంది.
ఆల్కహాల్ :
డ్రగ్స్, ఆల్కహాల్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ నిద్ర , జ్ఞాపకశక్తి రెండింటిపై ప్రభావం పడుతుంది. అంతే కాకుండా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల స్వల్పకాలిక జ్ఞాపకశక్తి కోల్పోయే సమస్య కూడా పెరుగుతుంది.
వయస్సు పెరగడం:
ఒక వ్యక్తి వయసు పెరిగే కొద్దీ అతని నిద్ర గణనీయంగా తగ్గుతుంది. అంతే కాకుండా వయస్సు పెరిగే కొద్దీ విషయాలను గుర్తుంచుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి సమయంలోనే తగినంత నిద్ర లేకపోవడం వల్ల మెమోరీ లాస్ ప్రమాదం ఉంటుంది.
Also Read: ఇవి తింటే.. మీ కిడ్నీలు సేఫ్ !
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
– ఈ సమస్యను ఎదుర్కోవడానికి, 6-7 గంటలు తగినంత నిద్రపోవడం ముఖ్యం.
– మనస్సును ప్రశాంతంగా , స్థిరంగా ఉంచడానికి యోగా, ధ్యానం చేయండి.
– ఈ మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి.
– విషయాలను గుర్తుంచుకోవడానికి మెమరీ గేమ్స్ ఆడండి.
– మంచి నిద్ర కోసం పడుకునే ముందు పుస్తకాలు చదవండి.
– నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి సువాసన ఉండే.. కొవ్వొత్తులను మీరు నిద్ర పోయే రూమ్‌లో వెలిగించండి. అంతే కాకుండా సాంగ్స్ వినండి.