SVSC: సాధారణంగా దర్శక రచయితలు ఒక సినిమా కథను అనుకున్నప్పుడు.. ఆ కథలో పాత్రలకు వీరైతే బాగా సరిపోతారు అనుకొని మరీ.. ఆ పాత్రలను డిజైన్ చేస్తారు. ఆ తర్వాత అదే పాత్రలలో వారినే నటింపచేయడానికి వారికి కథలు వినిపిస్తే, కొన్ని అనుకోని కారణాలవల్ల వారు ఆ కథలను రిజెక్ట్ చేస్తే.. ఆ కథలు ఇంకొకరి దగ్గరికి వెళ్తాయి. అయితే అలా రిజెక్ట్ చేసిన కథలు, ఇంకొకరు చేసి సూపర్ హిట్ అయితే మాత్రం.. ఆ పాత్రలు వదులుకున్న హీరోలు ఎంతో బాధపడతారు. ఇలాంటి ఎన్నో సందర్భాలు మనం ఇప్పటికే ఎన్నో చూసాం. సరిగ్గా ఇలాంటి ఒక గోల్డెన్ అవకాశాన్ని వదులుకున్నారు కింగ్ నాగార్జున (Hero Nagarjuna).
ముందుగా అనుకున్నది నాగార్జుననే..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెరకెక్కిన అతిపెద్ద మల్టీస్టారర్ చిత్రాలలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా కూడా ఒకటి. 2013 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి 7వ తేదీన రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. రీ రిలీజ్ లో కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాను నాగార్జున కోసం రాసుకున్నానని, కానీ కొన్ని రోజులకే వెంకటేష్(Venkatesh ), ఆయన సోదరుడు సురేష్ బాబు(Suresh Babu) ని కలిసాను అని తెలిపారు. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.
వెంకటేష్ కి అవకాశం ఎలా వచ్చిందంటే..?
శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ..” నేను ఒకసారి మా ఊరు వెళ్తుంటే.. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్(Marthand K Venkatesh) నాకు ఫోన్ చేసి, “నాగార్జునతో సినిమా చేయడానికి మీ వద్ద ఏదైనా కథ ఉందా? ” అని అడిగారు. అప్పటికి నేను కేవలం ‘కొత్త బంగారులోకం’ సినిమా మాత్రమే చేశాను. అందులో నటించింది యంగ్ హీరో. అయితే నాగార్జునకి స్టోరీ అనడంతో కాస్త టెన్షన్ పడుతూనే.. ఓకే సార్ త్వరలోనే చెబుతాను. అని ఫోన్లో రిప్లై ఇచ్చాను. ఇక ఇద్దరు అన్నదమ్ముల నేపథ్యంలో సినిమా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఎప్పటినుంచో నాలో ఉంది. ఇక హైదరాబాద్ కి వచ్చాక నాగార్జునను కలిసి అదే విషయం చెబుతూ.. మల్టీ స్టారర్ ఐడియా ఉంది సార్.. ఇంకా స్క్రిప్ట్ రెడీ చేయలేదు అని చెప్పాను. ఆయన చూద్దామన్నారు. ఇక తర్వాత మళ్లీ మార్తాండ్ ఫోన్ చేసి నిర్మాత సురేష్ బాబు పిలుస్తున్నారు అని చెప్పారు. ఇక ఆయన చెప్పినట్టుగానే నేను వెళ్లి కలిస్తే వెంకటేష్ కూడా అక్కడే ఉన్నాడు. ఇంతకుముందు చెప్పిన సోదరుల కథ ఆలోచన నేను వారితోనే పంచుకున్నాను. ఆ పాయింట్ వారికి నచ్చింది. కథ పూర్తి చేయమన్నారు. అలా నా రెండో సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేయాలనే నిర్ణయాన్ని చెప్పగా.. ఇక వాళ్లు కూడా అంగీకరించారు. అలా వెంకటేష్ తో ఈ సినిమా చేసి ముందుకు వెళ్లాను. లేకపోతే ముందుగా అనుకున్నట్టుగానే ఈ సినిమా నాగార్జునతో చేయాల్సి ఉంది. కానీ అలా ఆ ఛాన్స్ మిస్సయింది “అంటూ శ్రీకాంత్ అడ్డాల తెలిపారు. మొత్తానికైతే ఇక్కడ నాగార్జున తప్పిదం లేకపోయినా నాగార్జున మాత్రం ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ ని మిక్స్ చేసుకున్నారని అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు.
Pawan Kalyan Movie : పవర్ స్టార్ డబుల్ ధమాకా… ఫ్యాన్స్ కి ఇక పూనకాలే.!