Brahma Anandam OTT : కామెడీ బ్రహ్మా బ్రహ్మానందం (Brahmanandam), ఆయన తనయుడు రాజా గౌతమ్ (Raja Gautham) కలిసిన నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam) . గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. మరి ‘బ్రహ్మా ఆనందం’ మూవీని ఏ ఓటీటీలో, ఎప్పుడు చూడొచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…
‘బ్రహ్మా ఆనందం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రహ్మ ఆనందం’. ఆర్విఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గత నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో బ్రహ్మానందం యాక్టింగ్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీని ఆహా వేదికగా మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
‘బ్రహ్మా ఆనందం’ స్టోరీలోకి వెళ్తే…
బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం చిన్నప్పుడే తల్లిని, తండ్రిని కోల్పోతాడు. అతను థియేటర్ ఆర్టిస్ట్ గా పని చేస్తాడు. అయితే సెల్ఫిష్ గా ఉండే బ్రహ్మ ఎప్పటికైనా సరే ఓ పెద్ద యాక్టర్ కావాలని కలలు కంటాడు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడే ఢిల్లీలో జరగబోయే ఓ ఈవెంట్ లో నాటకం వేసే అద్భుతమైన అవకాశాన్ని తన గురువు సహాయంతో అందుకుంటాడు. కానీ ఈ పోటీలో పాల్గొనాలంటే ఆరు లక్షలు కట్టాలని ఈవెంట్ నిర్వాహకులు అడుగుతారు. దీంతో ఆ డబ్బు సర్దడానికి ఎంతగానో ప్రయత్నించి ఫెయిల్ అవుతాడు. అలాంటి టైంలో వృద్ధాశ్రమంలో ఉండే తన తాత మూర్తి అలియాస్ ఆనంద రామమూర్తి గుర్తొస్తాడు హీరోకి. తన పేరు మీద కోదాడ దగ్గర ఆరెకరాల భూమి ఉందని చెప్తాడు మూర్తి. తను చెప్పినట్టుగా చేస్తేనే అది ఇస్తానని బ్రాహ్మను పట్టుకొని ఊరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక స్టోరీ ఎలాంటి మలుపు తిరిగింది? మూర్తి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? అసలు బ్రాహ్మను మూర్తి ఊరికి ఎందుకు తీసుకెళ్లాడు? అనేది ఈ మూవీ స్టోరీ.
ఇదిలా ఉండగా ఈ మూవీ ఈవెంట్ లోనే మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం సృష్టించాయి. ‘బ్రహ్మ ఆనందం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ఈవెంట్ లో ఉన్నప్పుడే ఓ సందర్భంలో ఇల్లంతా మనవరాళ్లతోనే నిండిపోయింది అని అన్నారు చిరంజీవి. అంతేకాకుండా ఇంట్లో ఉంటే లేడీస్ హాస్టల్ లాగా అనిపిస్తోందని, తను వార్డెన్ లాగా ఫీల్ అవుతున్నానని అన్నారు. అలాగే రామ్ చరణ్ కి వారసత్వం కోసం కొడుకుని కనమని సలహా ఇచ్చానని ఫన్నీగా కామెంట్స్ చేశారు. ఆయన సరదాగానే ఈ కామెంట్స్ చేసినప్పటికీ, వారసత్వంపై చిరు చేసిన కామెంట్స్ జాతీయ స్థాయిలో వివాదాన్ని రేకెత్తించాయి. చిరు లాంటి మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని విమర్శలు విన్పించాయి.