Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన నాలుగో సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. పండుగ సీజన్లలో ఆ సంఖ్య మరింతగా పెరుగుతుంది. రైల్వే స్టేషన్లలో ఇసుకేస్తే రాలనంత మంది ఉంటారు. రీసెంట్ గా కుంభమేళా సమయంలో భక్తులతో రైళ్లు కిక్కిరిసిపోయాయి. చాలా మంది రిజర్వేషన్ సీట్లలోనూ కూర్చొని వాటిని ఖాళీ చేసేందుకు నిరాకరించారు. కొంత మంది టికెట్లు లేకుండానే రైలు అద్దాలు ధ్వంసం చేసి ఏసీ కోచ్ లలోకి దూరిపోయారు. అయితే, రిజర్వేషన్ సీట్లలో కూర్చొని లేవకపోతే.. సింపుల్ ఒకే ఒక్క మెసేజ్ తో మీ సీట్లో మీరు కూర్చునే అవకాశాన్ని పొందే అవకాశం ఉంటుంది.
పండుగల వేళ భారీగా రద్దీ
దీపావళి, హోలీ, ఛత్ వంటి పండుగల సమయంలో రైల్వే స్టేషన్లు రద్దీగా మారుతాయి. కాలు పెట్టేందుకు వీలు లేని పరిస్థితి ఉంటుంది. ఎలాగైనా రైల్లో వెళ్లాలని భావిస్తారు. ఈ నేపథ్యంలో కొంత మంది టికెట్లు లేకుండానే రైళ్లలోకి ఎక్కుతారు. మరికొంత మంది ఏకంగా రిజర్వ్ చేయబడిన సీట్లలో కూర్చుకుంటారు.
రద్దీ సమయాల్లో సీట్ల గొడవలు
సీట్లకు సంబంధించి తరచుగా ప్రయాణీకుల మధ్య వివాదాలు కొనసాగుతాయి. కొన్నిసార్లు కొట్లాటలు జరిగిన సందర్భాలున్నాయి. ఒకవేళ మీరు ఎప్పుడైనా రైల్వే ప్రయాణం చేసే సమయంలో.. మీ సీటు వేరొకరు ఆక్రమిస్తే, ముందుగా లేవమని చెప్పండి. ఒకవేళ వాళ్లు వినకపోతే, వాళ్లతో గొడవకు దిగకుండా సింఫుల్ గా ఈ పని చేయండి. ఒక ఎస్సెమ్మెస్ తో మీ సీటును మీరు పొందే అవకాశం ఉంటుంది.
మీ సీటును ఎలా పొందాలంటే?
ముందుగా మీ ఫోన్ ఓపెన్ చేయండి. ‘SEAT’ అని టైప్ చేయండి. ఆ తర్వాత మీ PNR నంబర్ రాయండి. ఆ తర్వాత స్పేస్ ఇచ్చి ‘SPEED’ అని టైప్ చేయాలి. ఈ మెసేజ్ ను 139కి పంపించాలి. ఈ మెసేజ్ రైల్వే కంట్రోల్ రూమ్ కు వెళ్తుంది. అక్కడి నుంచి టీటీఈకి సమాచారం వెళ్తుంది. వెంటనే టీటీఈ మీ సీటు దగ్గరికి వచ్చి క్లియర్ చేసి ఇస్తారు.
Read Also: తొలి రాజధానికి 56 ఏళ్లు.. దేశంలో ఎన్ని రైళ్లు సేవలు అందిస్తున్నాయో తెలుసా?
రైల్ మదత్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండిలా!
అటు RailMadad యాప్‌ని ఉపయోగించి లేదా భారతీయ రైల్వే అధికారిక వెబ్ సైట్ ద్వారా కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. RailMadad యాప్ గూగుల్ ప్లే స్టోర్ తో పాటు యాప్ స్టోర్ లోనూ అందుబాటులో ఉంటుంది. దానిని ముందుగా ఇన్ స్టాల్ చేసి, లాగిన్ అయిన తర్వాత పలు రకాలా రైల్వే సేవలను పొందే అవకాశం ఉంటుంది. రైల్వేకు సంబంధించిన ఫిర్యాదులు కూడా చెయ్యొచ్చు. కోచ్ లు క్లీన్ లేకున్నా, వాష్ రూమ్ లు నీట్ గా లేకున్నా, తినుబండారాలను ఎమ్మార్పీ ధరకు ఎక్కువగా విక్రయించినా ఫిర్యాదు చేయ్యొచ్చు.
Read Also: ఇండియన్ రైల్వే సరికొత్త నిర్ణయం, ఇక టికెట్ లేకుండా స్టేషన్ లోకి అడుగు పెట్టడం అసాధ్యం!