BigTV English

Trisha Krishnan: వారిని చూస్తోంటే భయం వేస్తోంది.. త్రిష సంచలన కామెంట్..!

Trisha Krishnan: వారిని చూస్తోంటే భయం వేస్తోంది.. త్రిష సంచలన కామెంట్..!

Trisha Krishnan:ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి, టాలీవుడ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నా.. ఇప్పటికీ స్టార్ బ్యూటీగానే రాణిస్తోంది. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ లో కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా అవకాశాన్ని అందుకుంటూ బిజీగా మారిపోయింది. 4 పదుల వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే ఉంటూ వరుస చిత్రాలలో నటిస్తోంది. ఇక ఇటీవల అజిత్ (Ajith ) నటించిన విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో కూడా నటిస్తోందిఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తూ ఉండగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తోంది – త్రిష

ఇకపోతే త్రిష ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ బిజీగా మారిపోయింది.. నిత్యం పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసిన త్రిష.. విషపూరితమైన వ్యక్తుల మధ్య బ్రతకడం చాలా కష్టంగా మారింది అంటూ తెలిపింది. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా.. “విషపూరితమైన వ్యక్తులు ఉన్న ఈ సమాజంలో మీరు ఎలా జీవితాన్ని కొనసాగిస్తారు. ఎలా నిద్రపోగలుగుతున్నారు. సోషల్ మీడియాలో ఇతరుల గురించి రూమర్స్ క్రియేట్ చేసి, అసంబద్ధమైన విషయాలను పోస్ట్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల నిజంగా భయం వేస్తుంది. ఇదంతా అజ్ఞాత పిరికితనం. దేవుడు మీ అందరిని నిజంగా ఆశీర్వదిస్తాడు” అంటూ ఒక రాసుకొచ్చింది. అంతేకాదు ఒక సాడ్ ఏమోజీ ను కూడా జత చేసింది. ప్రస్తుతం త్రిష పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు త్రిష ఎందుకు ఈ పోస్ట్ పెట్టిందో అర్థం కాక అభిమానులు సైతం పలు రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇకపోతే త్రిష పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు.


త్రిష కెరియర్..

ఇక త్రిష విషయానికి వస్తే.. తెలుగు, తమిళ్ భాష చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తగ్గించుకున్న ఈమె ఇప్పటివరకు తన నటనతో మూడు దక్షిణ ఫిలింఫేర్ పురస్కారాలు అందుకుంది. త్రిష హీరోయిన్ గా నటించడానికి ముందు సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా పోషించింది. ప్రశాంత్ హీరోగా నటించిన ‘జోడి’ సినిమాలో సిమ్రాన్ పక్కన కూడా కనిపించింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చి.. ఇన్నేళ్లు అవుతున్నా.. అదే అందంతో.. అదే స్టార్ స్టేటస్ తో కొనసాగుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.

Mehreen Pirzada: కొత్త ప్రయాణం మొదలైందంటూ కాబోయే వాడి ఫోటో షేర్ చేసిన మెహ్రీన్..!

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×