One Crore TV: ప్రస్తుతం డిజిటల్ ట్రండ్ కొనసాగుతోంది. బయటకు వెళ్తే ఫోన్, ఇంట్లోకి వస్తే టీవీ ఉండాల్సిందే. లేదంటే ఏదో తక్కువైనట్లు అనిపిస్తుంది. ఈ క్రమంలో అనేక మంది పోటీ పడి మరి టీవీలను కొనుగోలు చేస్తున్నారు. కొంత మంది పక్కింటి వారి కంటే పెద్ద టీవీ కొనుగోలు చేయాలని భావిస్తారు. వారికి 55 ఇంచుల టీవీ ఉంటే అంతకంటే ఎక్కువ 57 లేదా 65 ఇంచుల టీవీ కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో అనేక మందికి టీవీ ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది.
ఇల్లును కొనుగోలు చేసే ధర
ఈ నేపథ్యంలో అనేక మంది లక్షల రూపాయలు పెట్టి టీవీలను కొనుగోలు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇక సాధారణ ప్రజలే లక్షల రూపాయలు పెట్టి టీవీలు కొంటే, ఇక ధనవంతుల విషయానికి వస్తే ఈ రేటు డబుల్ లేదా అంతకు మించి ఉంటుందని చెప్పవచ్చు. కానీ అంత ధర ఉన్న టీవీలు ఉంటాయా, అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల మార్కెట్లోకి వచ్చిన Samsung Neo MS1 110 అంగుళాల మైక్రో LED 4K స్మార్ట్ టీవీ ధర అక్షరాల 1.14 కోట్ల రూపాయలు. ఈ ధరకి ఓ చిన్నపాటి ఇల్లును కూడా కొనుగోలు చేయవచ్చు. ఇంత రేటు ఉన్న ఈ టీవీ స్పెషల్ ఏంటి, ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డిస్‌ప్లే, విజువల్స్
Samsung Neo MS1 టీవీలో 110 అంగుళాల మైక్రో LED స్క్రీన్ ఉంది. దీని రిజల్యూషన్ 4K అంటే 3840 x 2160 పిక్సెల్స్ వీడియోలను ప్రదర్శిస్తుంది. అంటే మీరు సినిమాలు చూసినా, గేమ్స్ ఆడినా, స్పోర్ట్స్ మ్యాచ్‌లు చూస్తున్నా ప్రతి పిక్సెల్ మీ ముందే నాట్యం ఉన్నట్లుగా అనిపిస్తుంది. మైక్రో LED టెక్నాలజీతో వచ్చిన ఈ టీవీ రెగ్యులర్ టీవీల కంటే పదింతల మెరుగైన క్వాలిటీని అందిస్తుంది.
అద్భుతమైన రంగులలో
మరొక హైలైట్ ఏంటంటే ఇందులో వాడిన LEDలు సాధారణ LEDల కన్నా 1/10 వంతు పరిమాణంలో మాత్రమే ఉంటాయి. అంటే మైక్రోమీటర్లలో లెక్కించబడే 24.8 మిలియన్ LEDలు. ఇవి నీలిమణి పదార్థంతో తయారవ్వడం వల్ల రంగులలో అద్భుతమైన వైబ్రెన్సీ, డీప్ బ్లాక్ లెవెల్స్, హై కాంట్రాస్ట్ అందుతుంది.
Read Also: Become Crorepati: రోజుకు రూ.500 సేవింగ్..కోటి రూపాయల …
డిజైన్
ఈ టీవీ మోనోలితిక్ డిజైన్‌తో వస్తుంది. అంటే “no-gap” edges, అదృశ్య బెజెల్స్. మీరు దీన్ని గోడకి మౌంట్ చేసినా, స్టాండ్‌పై ఉంచినా, ఇది గదిలో ఒక అందమైన కళాఖండంలా కనిపిస్తుంది. స్లిమ్ అంచులు గల ఈ టీవీ, ఏ ఇంట్లో అయినా ఈజీగా సరిపోయేలా ఉంటుంది.
హోమ్ థియేటర్ అనుభూతి
ఈ టీవీలో 5.1 ఛానల్ స్పీకర్ సిస్టమ్ ఉంటుంది. ఈ సౌండ్ సిస్టమ్ “Arena Sound” టెక్నాలజీతో రూపొందించబడింది. అదనంగా OTS Pro (Object Tracking Sound), Dolby Atmos, Q-Symphony ఫీచర్లు కలవడంతో మీరు చూస్తున్న దృశ్యాలకు అనుగుణంగా ఆడియో చుట్టూ తిరుగుతుంది. సాధారణంగా టీవీ ఆడియో అనేది యావరేజ్ స్థాయిలో ఉండటమే. కానీ ఈ మోడల్ విషయంలో ఆడియో కూడా ఓ ప్రత్యేక కళ. సినిమా హాల్‌కు వెళ్లకుండానే ఈ టీవీ హోమ్ థియేటర్ అనుభూతిని ఇస్తుంది.
ఇంటెలిజెంట్ ఎంటర్‌టైన్‌మెంట్
ఈ టీవీ Tizen OS ఆధారంగా నడుస్తుంది. అంటే నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉంటాయి. అంతే కాదు Samsung Health, SmartThings Hub, Bixby Voice Assistant, Samsung TV+ వంటి ఎన్నో స్మార్ట్ ఫీచర్లు ఈ టీవీలో ఉండటం విశేషం.
గేమ్ లేదా సినిమా
ఈ టీవీకి సోలార్ సెల్ రిమోట్ ఉంటుంది. ఇది సూర్యకాంతి, రేడియో తరంగాలు, లేదా USB Type C ద్వారా ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ చేంజ్ అవసరం లేదు. Samsung Neo MS1 110 మోడల్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అంటే స్మూత్ మోషన్, ల్యాగ్-లెస్ అనుభవం. ఇది గేమర్స్‌కు చాలా ఉపయోగపడుతుంది. అలాగే HDR10+, 20-bit ప్రాసెసింగ్, AI అప్‌స్కేలింగ్, సీన్ అడాప్టివ్ కాంట్రాస్ట్, డైనమిక్ రేంజ్ ఎక్స్‌పాన్షన్+ వంటి ఫీచర్లు కలవడంతో టీవీ ముందర కూర్చుంటే మీరు గేమ్‌లో లేదా సినిమాలో నేరుగా ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది.
ధర ఎంత, ఎక్కడ కొనాలి..
ఈ టీవీకి రూ.1.14 కోట్లు, అంటే నిజంగా భారీ ధర. కానీ ఇది ఎవరికోసమో అర్థం చేసుకోవాలి. ఇది మామూలు వినియోగదారుల కోసం మాత్రం కాదు. అల్ట్రా లగ్జరీ ప్యామిలీలు, కార్పొరేట్ లాంజ్‌లు, సెలబ్రిటీ ఇంటీరియర్స్, మల్టీ మిలియన్ విల్లాల్లో నివసించే వారికి ఇది తప్పకుండా కనపడే విభాగం. ఈ మోడల్‌ను కొనాలంటే, మీరు Samsung అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లొచ్చు లేదా హైదరాబాద్, ముంబయ్, బెంగుళూరు లాంటి మెట్‌రో నగరాల్లోని హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్లను సంప్రదించవచ్చు. ఇది లిమిటెడ్ స్టాక్‌లో మాత్రమే ఉంటుంది, కాబట్టి కొనుగోలు చేయాలంటే ముందుగా రిజిస్టర్ అవ్వాల్సి ఉండవచ్చు.