BigTV English

Agent Movie:- అఖిల్‌తో ఊర్వ‌శీ రౌతేలా స్పెష‌ల్ నెంబ‌ర్‌

Agent Movie:- అఖిల్‌తో ఊర్వ‌శీ రౌతేలా స్పెష‌ల్ నెంబ‌ర్‌

Agent Movie:- అఖిల్ అక్కినేని తన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ మూవీపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మ‌రో వైపు కొంత టాకీతో పాటు పాట‌ను పూర్తి చేయాల్సి ఉంది. మేక‌ర్స్ ఆ దిశ‌గా ప్లాన్ చేసుకుని సినిమా షూటింగ్‌ను చ‌క చ‌కా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్‌తో పాటు త‌ను కూడా ఎగ్జ‌యిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాడు. ‘ఏజెంట్’ సినిమాను ఏప్రిల్ 28న తీసుకొస్తున్నారు. అఫిషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ఈ సినిమా కోసం అఖిల్ చాలానే క‌ష్ట‌ప‌డుతున్నారు. ‘ఏజెంట్’ మూవీ కోసం అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్‌లో క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్‌లో సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టించింది. సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ సుంక‌ర, సురేంద‌ర్ రెడ్డి ఏజెంట్‌ సినిమాను నిర్మిస్తున్నారు.


తాజాగా ఏజెంట్ మూవీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అదేంటంటే.. ఈ సినిమాలో అఖిల్‌తో బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శీ రౌతేలా ఆడి పాడ‌నుంది. వివ‌రాల్లోకెళ్తే.. ఏజెంట్ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ ఉంది. ఈ సాంగ్‌లో ఎవ‌ర్ని తీసుకుంటే బావుంటుంద‌ని మేక‌ర్స్ తెగ ఆలోచించారు. చివ‌ర‌కు ఊర్వ‌శీ రౌతేలాకు ఓటేసిన‌ట్టు టాక్‌. ఈ అమ్మ‌డు వాల్తేరు వీర‌య్య చిత్రంలోనూ చిరంజీవితో ఆడిపాడింది. త్వ‌ర‌లోనే అఖిల్ అక్కినేనితోనూ స్టెప్స్ వేయ‌నుంది.

ఈ సినిమా త‌ర్వాత త‌దుప‌రి సినిమా ఏంట‌నేది అఖిల్ ఇంకా అనౌన్స్ కూడా చేయ‌లేదు. అయితే నానితో దస‌రా సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ త‌దుప‌రి సినిమా ఉంటుంద‌నే వార్త‌లైతే వినిపిస్తున్నాయి. అయితే ఏజెంట్ రిలీజ్ అయిన తర్వాతే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఉండొచ్చునని ఫిల్మ్ సర్కిల్స్ టాక్.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×