E-Paper
Advertisement

Thalaivar 171 Updates : తలైవర్ 171 .. విలన్ గా చంద్ర‌ముఖి2 హీరో ..

Thalaivar 171 Updates : తలైవర్ 171 .. విలన్ గా చంద్ర‌ముఖి2 హీరో ..
Advertisement
Thalaivar 171 Updates

Thalaivar 171 Updates : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కుర్ర హీరోల కంటే ఏజ్ బార్ హీరోలే మంచి జోరు మీద ఉన్నారు. టాలీవుడ్ లో ఆరు పదులు వయసు దాటిన అందగాళ్ళు బాలకృష్ణ, చిరంజీవి వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. తమిళ్ లో అటు కమలహాసన్ ఇటు రజినీకాంత్ తగ్గేదే లేదని బాక్స్ ఆఫీస్ ని బంతాట ఆడేస్తున్నారు. రీసెంట్గా సంచలనం సృష్టించిన చిత్రాలు అన్ని ఈ హీరోలవే కావడంతో వీళ్లకు మరింత క్రేజ్ పెరిగింది. భాషతో సంబంధం లేకుండా థియేటర్లను దద్దరిల్లేలా చేసే తలైవా రజినీకాంత్.

రీసెంట్ గా విడుదలైన రజిని జైలర్ చిత్రం ఎటువంటి సంచలమైన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో తన నెక్స్ట్ మూవీ కోసం భాషా సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ మూవీలో రజనీకాంత్ పక్కన విలన్ గా నటించడానికి ఓ ప్రఖ్యాత హీరో కం కొరియోగ్రాఫర్ ని అనుకుంటున్నట్లు ప్రస్తుతం టాక్. అలాగే అతను ఒక మంచి డైరెక్టర్ కూడా.. ఇంతకీ ఎవరు ఈ ఆల్ రౌండర్ అనుకుంటున్నారా?

Advertisement

అతను ఎవరో కాదండి రాఘవ లారెన్స్. పాపం మొన్న చంద్రముఖి 2 అంటూ వచ్చి కాస్త నీరసించాడు. కానీ మామూలుగా లారెన్స్ నటన అద్భుతంగా ఉంటుంది.

లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న రజినీకాంత్ యాక్షన్ మూవీ తలైవర్ 171 లో విలన్ గా నటించడానికి లారెన్స్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ 2024 మార్చ్ లేదా ఏప్రిల్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Advertisement

ఇది లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో వచ్చే 6 వ చిత్రం అవుతుంది. అయితే ఈ మూవీకి లోకేష్ సృష్టించిన మల్టీ యూనివర్స్ కు సంబంధం ఉండదట. అంటే ఇది ఎల్.సి.యు లో భాగం కాదు.. అనేది కన్ఫర్మ్. మరి ఈ మూవీలో ఎటువంటి భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయో చూడాలి. పైగా ఇందులో రజిని లుక్ ఎలా ఉంటుంది అన్న విషయంపై కూడా సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది.

రజనీకాంత్ మూవీ అంటే అంచనాలు మామూలుగా ఉండవు.. వరుస విజయాలతో దూసుకుపోతున్న లోకేష్ కనకరాజ్ దీనికి డైరెక్టర్ అంటే.. స్టోరీ ఏ లెవెల్ లో ఉంటుందో చూడాలి. ఇందులో లారెన్స్ విలన్ గా చేస్తే ఎలా ఉంటుందో అని నెటిజన్స్ కూడా ఎగ్జైట్ అవుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×