BigTV English

Aishwarya Rai Bachchan: ఒక్క ఫోటోతో రూమర్స్ కి చెక్.. ఇకనైనా ఆగేనా..?

Aishwarya Rai Bachchan: ఒక్క ఫోటోతో రూమర్స్ కి చెక్.. ఇకనైనా ఆగేనా..?

Aishwarya Rai Bachchan.. మాజీ విశ్వసుందరిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్యరాయ్(Aishwarya Rai) తన అందచందాలతో.. మేని ఛాయతో ఎంతోమందిని తన వశం చేసుకుంది. ముఖ్యంగా తన అందంతో యావత్ ప్రపంచస్థాయి అభిమానులను మెప్పించిన ఈమె, ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరించింది. బాలీవుడ్ లో భారీగా పాపులారిటీ అందుకున్న తర్వాత తెలుగు, తమిళ్ అంటూ భాషతో సంబంధం లేకుండా సౌత్ ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.


ఐశ్వర్య – అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారా..

కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడిన ఈమె.. కొన్ని కారణాలవల్ల అతని నుంచి విడిపోయి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఆరాధ్య అనే అమ్మాయి కూడా జన్మించింది. అయితే ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంటపై విడాకుల రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేయకపోగా .. వీరు చేసిన పనులే ఈ వార్తలకు మరింత ఆజ్యం పోశాయని చెప్పవచ్చు.


ఒక ఫోటోతో రూమర్స్ కి చెక్..

Aishwarya Rai Bachchan: Check Rumors With One Photo.. Will It Stop Anymore..?
Aishwarya Rai Bachchan: Check Rumors With One Photo.. Will It Stop Anymore..?

ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యారాయ్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కొంతకాలం గా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వీటన్నింటినీ పెద్దగా పట్టించుకోలేదు. సమయం వచ్చినప్పుడు మాత్రం ఆ రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ వదంతులకు పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ. అంగరంగ వైభవంగా జరుగుతున్న ప్యారిస్ ఫ్యాషన్ వీక్ కు హాజరైన ఈమె.. తన చేతికి వెడ్డింగ్ రింగు ధరించి ఫోటోలకు ఫోజులిచ్చి రూమర్స్ కి చెక్ పెట్టింది.

ఐశ్వర్య తెలివికి ఫ్యాన్స్ ఫిదా..

ఈ రింగ్ తన వివాహ సమయంలో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య కి తొడిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రూమర్స్ కి చెక్ పెట్టింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు రూమర్స్ పై పెద్దగా స్పందించకుండా ఒక ఫోటోతో తెలివిగా నోరు మూయించింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఐశ్వర్య చేసిన ఈ పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు.

ఐశ్వర్యరాయ్ సెకండ్ ఇన్నింగ్స్..

ఐశ్వర్యారాయ్ సినిమాల విషయానికొస్తే.. తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ అనే సినిమాతో మొదలుపెట్టి ఈ సినిమాలో మంచి ఇమేజ్ అందుకుంది. అంతేకాదు ఈమె అందం చూసిన ప్రతి ఒక్కరు మునుపటి అందం మళ్ళీ మొగ్గ లేసింది అంటూ కామెంట్లు చేశారు. మొత్తానికైతే ఈ నీలి కళ్ళ సుందరికి అటు ఇండస్ట్రీలో సక్సెస్ లభించి, ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమై, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినా సరే క్రేజ్ మాత్రం మళ్లీ తగ్గలేదని చెప్పవచ్చు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×