Film industry:బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) గత రెండు సంవత్సరాల నుండి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దానికి ప్రధాన కారణం అభిషేక్ బచ్చన్ (Abhishek bachchan) తో విడిపోతున్నట్టు వార్తలు రావడమే. అయితే అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ విడాకుల వార్తలు చాలాసార్లు వినిపించాయి. కానీ ఆ విడాకుల వార్తలు వినిపించినప్పుడల్లా వారికి గట్టి సమాధానం ఇస్తున్నారు ఈ జంట. ప్రతిసారి ఐశ్వర్య రాయ్ – అభిషేక్ బచ్చన్ జంటగా కనిపిస్తూ తమ మధ్య విభేదాలు ఏమీ లేవని తేల్చి చెబుతున్నారు. రీసెంట్ గా ఫ్రాన్స్ లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో నుదుటిన సింధూరం పెట్టుకొని ఎంతో హుందాగా కనిపించి భారతదేశం సత్తా ఏంటో నిరూపించింది ఐశ్వర్య. అయితే అలాంటి ఐశ్వర్య రాయ్ పై తాజాగా సోషల్ మీడియాలో నెగిటివిటీ ఏర్పడింది. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
కూతురికి సర్జరీ చేయించిన ఐశ్వర్యరాయ్..
తాజాగా ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) తో కలిసి ఉన్న ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియోలో ఐశ్వర్యరాయ్ కంటే ఆమె కూతురు చాలా అందంగా, క్యూట్ గా కనిపిస్తోంది.కానీ ఇందులో ఏముంది తల్లి కంటే కూతురు క్యూట్ గానే కనిపిస్తుంది కదా.. ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏముంది అనుకోవచ్చు.కానీ ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ సడన్ గా అంత క్యూట్ గా కనిపించే సరికి సోషల్ మీడియాలో ఒక పుకారు షికారు చేస్తోంది.అదేంటంటే 13 ఏళ్ల ఆరాధ్య బచ్చన్ కి ఐశ్వర్యరాయ్ సర్జరీ చేయించిందని,ఆ సర్జరీ కారణంగానే ఆరాధ్య బచ్చన్ ఫేస్ అలా క్యూట్ గా మారిపోయింది అంటూ ఒక వార్త తెర మీద చెక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్త వైరల్ అవుతున్న తరుణంలోనే ఆరాధ్య బచ్చన్ ఫోటోలు చూసిన చాలా మంది నెటిజన్స్ 13 ఏళ్ల అమ్మాయికి సర్జరీ చేయిస్తావా.. ?నువ్వు అసలు తల్లివేనా.. ? అసలు 13 ఏళ్ల అమ్మాయికి సర్జరీ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటూ ఐశ్వర్యరాయ్ ని ఏకిపారేస్తున్నారు నెటిజన్స్. అయితే అసలు ఐశ్వర్య రాయ్ తన కూతురికి సర్జరీ చేయించిందో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం నెగిటివిటీని మూట గట్టుకుంది.ఇక చాలామంది సెలబ్రిటీలు సినిమాల్లోకి వచ్చే ముందు, సినిమాల్లోకి వచ్చాక అందం కోసం, అవకాశాల కోసం కొన్ని సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు.
ALSO READ: Harihara Veeramallu: జోరు పెంచిన పవన్ కళ్యాణ్.. ఏకధాటిగా 4గంటల పాటూ..!
చెయ్యని తప్పుకు మళ్ళీ నెగెటివిటీ..
అలా తాజాగా అలాంటి సర్జరీనే 13 ఏళ్ల వయసుకే ఆరాధ్య బచ్చన్ కి ఐశ్వర్య రాయ్ చేయించింది అంటూ ఒక సంచలన ఆరోపణ బీ టౌన్ లో వినిపిస్తోంది. మరి ఆరాధ్య బచ్చన్ కి ఐశ్వర్య సర్జరీ చేయించింది అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే కచ్చితంగా ఐశ్వర్య రాయ్ నోరు విప్పాల్సిందే అంటున్నారు ఐశ్వర్య రాయ్ ఫ్యాన్స్. అయితే ఆరాధ్య బచ్చన్ కి సర్జరీ చేయించారనే రూమర్లు ఇప్పుడే కాదు గతంలో కూడా వినిపించాయి.గతంలో ఆరాధ్య బచ్చన్ సడన్ గా డిఫరెంట్ హెయిర్ కట్ తో కనిపించిన సమయంలో కూడా ఐశ్వర్య రాయ్ కూతురికి సర్జరీ చేయించింది అనే రూమర్లు వినిపించాయి. అయితే తాజాగా మరోసారి ఆ రూమర్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.మరి కూతురి సర్జరీ ఇష్యూ పై ఐశ్వర్య రాయ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
?utm_source=ig_web_copy_link