Harihara Veeramallu:ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు(Harihara Veeramallu). జూన్ 12వ తేదీన చాలా స్పెషల్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది. స్పెషల్ అనే పదం ఎందుకు వాడాల్సి వస్తోంది అంటే.. గత ఏడాది ఇదే రోజున పవన్ కళ్యాణ్ తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. దశాబ్దకాల నిర్విరామ శ్రమ తర్వాత ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా..” పవన్ కళ్యాణ్ అనే నేను” అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆ రోజుకి గుర్తుగానే ఇప్పుడు తన మొదటి సినిమాని కూడా విడుదల చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా జోరు పెంచిన పవన్ కళ్యాణ్ ఏకధాటిగా నాలుగు గంటల పాటు ఈ సినిమా కోసం పనిచేసినట్లు తెలుస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
డబ్బింగ్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. మరొకవైపు చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయడానికి డేట్స్ ఇస్తున్నారు. అటు ప్రభుత్వ పాలనతో విరామం లేకుండా పరిపెడుతున్న ఈయన.. మరొకవైపు ఓజీ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా తాజాగా హరిహర వీరమల్లు సినిమాకి పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే… నిన్నంతా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్ చేసి, ఆ తర్వాత రాత్రికి 10 గంటలకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారట. అలా 4:00 గంటల పాటు ఏకధాటిగా పనిచేసి, తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ మొత్తం పూర్తి చేసినట్లు సమాచారం.
ALSO READ: Ileana: మళ్లీ తల్లి కాబోతున్న ఇలియానా… ఫోటోలు రిలీజ్ చేసి…
అందుకే పవన్ కళ్యాణ్ స్టార్ అయ్యారు..
ఇక ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా హీరోలు డబ్బింగ్ అంటే సినిమా మొత్తానికి ఒక వారం రోజులపాటు సమయం తీసుకుంటారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఒక రోజంతా తమ పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి సమయం తీసుకుంటారు. కానీ సినిమా మెయిన్ హీరో .. అందులోనూ క్షణం తీరికలేని బిజీ షెడ్యూల్లో కూడా సినిమా కోసం ఏకధాటిగా నాలుగు గంటలు పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక పవన్ కళ్యాణ్ డెడికేషన్ కి హీరోలే కాదు అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఈ స్టేజ్ లో ఉన్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది పగలంతా షూటింగ్ చేసి, రాత్రికి మళ్ళీ కంటిన్యూగా నాలుగు గంటలు డబ్బింగ్ చెప్పడం అంటే నిజంగా గ్రేట్ అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడడంతో ఆయన కష్టానికి అభినందనలు తెలియజేస్తున్నారు. మొత్తానికైతే అటు ప్రేక్షకులను ఇటు ప్రజలను మెప్పించడానికి పవన్ కళ్యాణ్ విశ్రాంతి లేకుండా పని చేస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలా కష్టపడుతున్నారు కాబట్టే స్టార్ హోదా దక్కించుకున్నారని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.