E-Paper
Advertisement

Aishwarya Rajinikanth’s New Home: కొత్త ఇంటిని కొనుగోలు చేసిన ఐశ్వర్య రజినీకాంత్‌.. సూపర్ స్టార్ స్మైల్ చూశారా..?

Aishwarya Rajinikanth’s New Home: కొత్త ఇంటిని కొనుగోలు చేసిన ఐశ్వర్య రజినీకాంత్‌.. సూపర్ స్టార్ స్మైల్ చూశారా..?
Advertisement

Aishwarya Rajinikanth Bought a New House: సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ పలు సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్‌గా మరోవైపు దర్శకత్వంలోనూ తనదైన ముద్ర వేసుకుని దూసుకుపోతుంది. మరియప్పన్, 3, వెయ్ రాజా వెయ్, సినిమా వీరన్‌తో సహా ఇటీవల రిలీజ్ అయిన లాల్ సలాం వంటి సినిమాలకు దర్శకత్వం వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

అయితే ఇటీవల రిలీజ్ అయిన లాల్ సలాం మూవీ ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేకపోయింది. ఇకపోతే ఆమె వ్యక్తిగత విషయానికొస్తే.. ఐశ్వర్య రజినీకాంత్ 2004లో హీరో ధనుష్‌ను మ్యారేజ్ చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు. వారు యాత్ర, లింగ. అయితే ఈ జంట ఎన్నో ఏళ్లు కలిసి ఉన్న తర్వాత 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు.

Advertisement

తమ 18 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే వారు తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఇద్దరూ సపరేట్‌గానే ఉంటున్నారు. విడాకుల ప్రకటన అనంతరం ఐశ్వర్య రజినీకాంత్ తన పేరెంట్స్ వద్దకు వచ్చేసింది. అప్పటి నుంచి ఆమె తన కుటుంబంతో కలిసి ఉంటుంది.

Also Read: ఇద్దరు స్టార్లు కలిసారు భయ్యా.. ఇక బాక్సాఫీసు బద్దలే..

Advertisement

ఈ నేపథ్యంలోనే ఆమె సొంతంగా ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. అనంతరం ఆమె అక్కడికి షిఫ్ట్ అయింది. అయితే ఆ ఇంటికి తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్, ఆయన సతీమణి లత కలిసి వెళ్లారు. ఇక ఇంట్లోకి వెళ్లిన సూపర్ స్టార్ దంపతులు దేవుడి దగ్గర దీపం వెలిగించారు. ఆపై ఇళ్లు మొత్తం చూసి హ్యాపీగా ఫీలయ్యారు.

కూతురి సొంత ఇంటిని చూసి రజినీ తెగ మురిసిపోయాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో చూసిన నెటిజన్లు రజినీకాంత్ స్మైల్ చూసి ఫుల్ ఖుష్ అవుతున్నారు. అంతేకాకుండా కొత్త ఇంట్లో ఐశ్వర్య రజినీకాంత్‌కు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Also Read: Indian 2: కమల్ హాసన్‌ ఫ్యాన్స్‌కు మళ్లీ షాక్.. ఇండియన్ 2 వాయిదా?.. పండగ చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

ఇదిలా ఉంటే రజినీకాంత్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో ‘కూలీ’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీతో పాటు మరొక సినిమా కూడా చేస్తున్నాడు. ‘జై భీమ్’ ఫేం టీ.జే జ్ఞానవేల్‌తో ‘వెట్టియాన్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×