E-Paper
Advertisement

Indian 2: కమల్ హాసన్‌ ఫ్యాన్స్‌కు మళ్లీ షాక్.. ఇండియన్ 2 వాయిదా?.. పండగ చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

Indian 2: కమల్ హాసన్‌ ఫ్యాన్స్‌కు మళ్లీ షాక్.. ఇండియన్ 2 వాయిదా?.. పండగ చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్..!
Advertisement

Indian 2 Postponed From June 2024: విలక్షణ నటుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో మళ్లీ పుంజుకున్నాడు. అప్పటి వరకు ఎలాంటి హిట్లు లేక సతమతమయ్యాడు. కానీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమ్’ మాత్రం కమల్‌ హాసన్‌కు, ఆయన అభిమానులకు ఫుల్ ఎనర్జీ అందించింది. దీంతో కమల్ పలు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. అందులో ఒకటి ‘ఇండియన్ 2’ చేస్తున్నాడు.

ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘భారతీయుడు’ 1996లో విడుదలై సంచలన విజయాన్ని కైవసం చేసుకుంది. అప్పట్లో మంచి కలెక్షన్లను సైతం ఈ మూవీ రాబట్టింది. ఆ తర్వాత ఇన్నేళ్లకు ఇప్పుడు ‘ఇండియన్ 2’ మూవీ తెరకెక్కడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు కంప్లీట్ చేసుకుంది.

Advertisement

అంతేకాకుండా ఈ సీక్వెల్ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు కమల్ హాసన్ ఓ కారణం అయితే.. మరొక కారణం దర్శకుడు శంకర్. ఈ సీక్వెల్ చిత్రాన్ని దర్శకుడు శంకర్ ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ మూవీకు మాత్రం ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. ఒకానొక సమయంలో ఈ మూవీ ఆగిపోయిందా? అనే అనుమానాలు కూడా వెళ్లువెత్తాయి. ఆ తర్వాత మళ్లీ ఈ మూవీ నుంచి పోస్టర్లు రిలీజ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక దర్శకుడు కూడా ఈ మూవీతో పాటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌ను లైన్‌లో పెట్టడంతో.. అటు సగం షూటింగ్.. ఇటు సగం షూటింగ్ చేసేవాడు. ఇక ఏది ఏమైనా ‘ఇండియన్ 2’ షూటింగ్‌ను ఆఖరి వరకు చేరుస్తూ.. అభిమానులను ఫుల్ ఖుష్ చేశాడు.

Also Read: కం బ్యాక్ ఇండియన్.. ఒక టీజర్ తో ప్రభంజనం సృష్టించిన శంకర్..

Advertisement

ఇందులో భాగంగానే ఈ మూవీ రిలీజ్ డేట్‌పై కూడా అప్డేట్ అందించారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్‌ లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే అది జూన్ రెండో వారంలో అని టాక్ నడిచింది. దీంతో అంతా హ్యాపీగా ఫీలయ్యారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్‌కు మరొక నెల మాత్రమే ఉందని సంబరపడిపోయారు. ఈలోపు ఓ బ్యాడ్ న్యూస్ వారిని కంగారు పెట్టిస్తుంది.

తాజాగా ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ జూన్‌లో విడుదలవడం కష్టమని తెలుస్తోంది. అందుకు కారణం కూడా ఉంది. ఇంకా ఈ మూవీకి పెండింగ్ వర్క్ చాలా ఉండటంతో ఇండియన్ 2ను వాయిదా వేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ వార్తతో అందరూ షాక్ అవుతున్నారు.

ఇక ఈ మూవీ జూన్ రేస్‌ నుంచి తప్పుకోవడంతో ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీకి కలిసి వచ్చిందని తెలుస్తోంది. ఎందుకంటే కల్కి మూవీ జూన్ 27న రిలీజ్ కానుంది. మరి దీనికంటే ముందు అంటే జూన్ రెండో వారంలో ఇండియన్ 2 మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంటే కల్కిపై ప్రభావం పడుతుంది. అందువల్లనే ఇండియన్ 2 తప్పుకోడం కల్కికి కలిసొచ్చిందని ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దీంతో జూన్, జూలై మొత్తం కల్కి సందడే వినిపించనుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×