BigTV English

Road Accident in Canada: దొంగను వెంబడించబోయిన పోలీసులు.. ముగ్గురు మృతి!

Road Accident in Canada: దొంగను వెంబడించబోయిన పోలీసులు.. ముగ్గురు మృతి!

2 Indians Grand Child Died in Canada Road Accident: చోరీ చేసి పారిపోతున్న దొంగను పోలీసులు వెంబడిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. అందులో ఇద్దరు వృద్ధ దంపతులు, మూడు నెలల చిన్నారి ఉన్నారు. తన కూతురును చూసేందుకని వచ్చిన ఆ వృద్ధ దంపుతులు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ కుటంబంలో విషాదం నెలకొంది.


ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కెనడాలోని ఒంటారియోలో ఓ దొంగ ఓ వైన్ షాపులో దొంగతనానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అతను తన కారులో పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే తమ వాహనంలో వెంబడించారు.

Also Read: మాజీ మంత్రి ఘాతుకం: భార్య జుట్టు పట్టి ఈడ్చికెళ్తూ.. ఇష్టానుసారంగా తన్ని..


పోలీసులు తనను వెంబడించడంతో అతను రాంగ్ రూట్ లో వెళ్లి భారతీయులు ప్రయాణిస్తున్నటువంటి కారును ఢీకొట్టాడు. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు భారతీయులు, వారి మనవడు మృతిచెందాడు. మనవడి వయసు మూడు నెలలు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వృద్ధ దంపతుల కూతురు తీవ్రంగా గాయపడింది. ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంలో మృతిచెందినటువంటి ఈ వృద్ధ దంపతులు తన కూతురును చూసేందుకు ఇండియా నుంచి కెనడాకు వచ్చారని, ఈ క్రమంలో వారు ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయారని వారు పేర్కొన్నారు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×