BigTV English

Star Hero Son: స్టార్ హీరో కొడుకుతో అజయ్ భూపతి కొత్త సినిమా?

Star Hero Son: స్టార్ హీరో కొడుకుతో అజయ్ భూపతి కొత్త సినిమా?

Star Hero Son: టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ ను సొంతం చేసుకున్న మూవీ ఆరెక్స్ 100 సినిమా ను తెరకెక్కించిన డైరెక్టర్ అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో ఓ సంచలనం సృష్టించాడు డైరెక్టర్‌ అజయ్‌ భూపతి. ఆ తర్వాత తెరకెక్కించిన ‘మహా సముద్రం’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా మంచి మార్కులు పడ్డాయి.. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలు లైన్లో పెట్టాడు కానీ ఒక్క సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లలేదు. రీసెంట్ గా మంగళవారం సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలలతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో స్టార్ కిడ్ తో కొత్త సినిమాను ప్రకటించాడు.. ఆ సినిమా హీరో, హీరోయిన్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం…


గత ఏడాది పాయల్ రాజ్ పుత్ తో మంగళవారం సినిమాను చేశాడు అజయ్.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ సినిమా ఉండబోతుందని అనౌన్స్ చేశాడు. ఆ సినిమా కన్నా ముందే మరో సినిమాను ప్రకటించాడు. ఓ స్టార్ హీరో కొడుకుతో కొత్త సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్.. అజయ్ భూపతి దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ ఓ భారీ సినిమా చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. విక్రమ్, ఆయన తనయుడిని కలిసి అజయ్ భూపతి కొన్ని రోజుల క్రితం కలిశారని, న్యూ ఏజ్ కాన్సెప్ట్ కథను చెప్పారని సమాచారం. ఆయన కథ నచ్చడంతో పాటు ట్రాక్ రికార్డ్ చూసి వెంటనే ఓకే చెప్పేశారట..

Ajay Bhupathi's new movie with star hero son?
Ajay Bhupathi’s new movie with star hero son?

‘అర్జున్ రెడ్డి’ తమిళ్ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ తో ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తండ్రి తో కలిసి ‘మహాన్’ సినిమా చేశారు. ఇప్పుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం లో ఆయన ‘బిషన్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత అజయ్ భూపతి తో సినిమా చేయబోతున్నట్లు టాక్. దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇందులో నటిస్తున్న యాక్టర్స్ త్వరలోనే ప్రకటించానున్నారని టాక్.. ఇక మంగళవారం సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. ఆస్కార్స్ 2025 అవార్డుల కు ఇండియా నుంచి ‘లాపతా లేడీస్’ అఫీషియల్ ఎంట్రీగా పంపించారు. అయితే… ఆ సినిమా కు గట్టి పోటీ ఇచ్చిన సినిమాల్లో ‘మంగళవారం’ ఉంది.. మరి మంగళవారం సినిమాకు ఆస్కార్ వస్తుందో లేదో తెలియాల్సి ఉంది. ఇక పాయల్ రాజ్ పుత్ విషయానికొస్తే.. మంగళవారం తర్వాత ఆమె లైఫ్ టర్న్ అయ్యిందని తెలుస్తుంది.. ఆ తర్వాత వచ్చిన రక్షణ సినిమా తో కూడా మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది… ఇప్పుడు మరో రెండు సినిమాలతో బిజీగా ఉంది పాయల్


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×