BigTV English

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాతో బిగ్ బాస్ జోకులు.. నిఖిల్‌పై యష్మీ మాస్టర్ ప్లాన్, ఎవరూ ఊహించి ఉండరు!

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాతో బిగ్ బాస్ జోకులు.. నిఖిల్‌పై యష్మీ మాస్టర్ ప్లాన్, ఎవరూ ఊహించి ఉండరు!

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్‌కు ప్రతీవారం ఒక కొత్త ట్విస్ట్‌లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈసారి బిగ్ బాస్‌లో కెప్టెన్స్ అనేవారు ఉండరు అని, కేవలం చీఫ్స్ స్థానాల కోసమే పోటీలు జరుగుతున్నాయి. ఇక మూడు వారాల నుండి తన చీఫ్ స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు నిఖిల్. ఇప్పుడు కొత్తగా సీత కూడా బిగ్ బాస్ హౌస్‌లో చీఫ్ స్థానాన్ని సంపాదించుకుంది. చీఫ్స్ టాస్క్ అయిపోయింది అనుకునేలోపే కంటెస్టెంట్స్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌లోకి రాకుండా ఉండాలంటే ప్రస్తుతం హౌస్‌లో నిఖిల్, సీత టీమ్స్ మధ్య పోటీ జరగాల్సిందే. ఆ పోటీలకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


కాంతార విన్

‘‘బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ బాల్‌ను పట్టు టవర్‌లో పెట్టు’’ అని బిగ్ బాస్ చెప్పడంతో ప్రోమో మొదలవుతుంది. ఈ టాస్క్‌లో ఒక పొడవు స్టిక్‌పై బాల్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లి అవతలి వైపు ఉన్న పెద్ద టవర్‌లో దానిని పడేయాలి. ముందుగా ఈ టాస్క్‌లో పోటీపడడానికి నిఖిల్ టీమ్ నుండి తానే స్వయంగా రంగంలోకి దిగాడు. సీత టీమ్ నుండి నబీల్ వచ్చాడు. నిఖిల్ ఇంకా స్టిక్‌పై బాల్‌ను బ్యాలెన్స్ చేయడానికి కష్టపడుతున్న సమయంలోనే దానిని టవర్‌లో వేసేశాడు నబీల్. అలా సీత టీమ్ అంతా వేగంగా ఆడి టాస్క్‌ను పూర్తి చేసి విన్నర్స్ అయ్యారు.


Also Read: ఆమెను గెలిపించండి అంటూ వర్మ అభ్యర్థన..కప్పు గ్యారెంటీయేనా..?

చూసి ఆనందించడమే

సీత టీమ్ గెలిచింది కాబట్టి వైల్డ్ కార్డ్ 12 కార్డ్‌ను తీసేసి కాంతార టీమ్ కార్డ్‌ను అక్కడ పెట్టారు. బాల్స్ టాస్క్ తర్వాత కంటెస్టెంట్స్‌కు ఫుడ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అదే ‘ఈట్ ఇట్ టూ బీట్ ఇట్’. ఈ టాస్క్‌లో ఇరు టీమ్స్‌కు ఫుల్‌గా ఫుడ్ పెట్టారు బిగ్ బాస్. ముందుగా ఎవరైతే ఆ ఆహారాన్ని పూర్తిచేసే వారే ఇందులో విన్నర్. ఈ టాస్క్ ఆడడం కోసం నబీల్, సోనియా ముందుకొచ్చారు. వీరిద్దరూ తింటూ ఉంటే కంటెస్టెంట్స్ అంతా తమకు కూడా కొంచెం పెడితే బాగుంటుంది అన్నట్టే చూశారు. అందుకే ఆ భోజనాన్ని చూస్తుంటే తనకు కూడా ఆకలేస్తుందా అని విష్ణుప్రియాను అడిగారు బిగ్ బాస్. దానికి విష్ణుప్రియా అవును అని సమాధానం ఇవ్వగా.. అయితే చూసి ఆనందించు అని కౌంటర్ ఇచ్చారు.

సాయంగా యష్మీ

ఇంకొక నెలరోజుల పాటు చికెన్ ఉండదు తినండి అంటూ సోనియాను మోటివేట్ చేశాడు పృథ్వి. సోనియా, నబీల్ టాస్క్ కోసం కష్టపడుతుంటే తమరి టీమ్స్ నుండి మరొకరి సాయం కూడా తీసుకోవచ్చని అన్నారు బిగ్ బాస్. దీంతో నబీల్‌కు సాయంగా ఆదిత్య ఓం, సోనియాకు సాయంగా యష్మీ వచ్చారు. అసలు ఈ టాస్క్ కోసం యష్మీని ఎందుకు ఎంపిక చేశాడో సోనియా, పృథ్వికి క్లారిటీ ఇచ్చాడు నిఖిల్. ‘‘యష్మీని ఎందుకు అనుకున్నానంటే తను వందశాతం ఆడడానికి ప్రయత్నిస్తుంది. మన లోపాలు వెతకడానికి మన టీమ్‌కు వచ్చిందని నాకు అనిపిస్తుంది’’ అని నిఖిల్ చెప్తుండగానే యష్మీ అక్కడికి వచ్చింది. దీంతో వెంటనే సైలెంట్ అయిపోయాడు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×