BigTV English

Hero Ajith Kumar Accident Video: స్టార్ హీరో అజిత్ కు యాక్సిడెంట్.. వీడియో చూస్తే షేక్ అవ్వాల్సిందే?

Hero Ajith Kumar Accident Video: స్టార్ హీరో అజిత్ కు యాక్సిడెంట్.. వీడియో చూస్తే షేక్ అవ్వాల్సిందే?
Kollywood Actor Ajith Kumar
Kollywood Actor Ajith Kumar

Tamil Hero Ajith Kumar Accident Video got Viral in Social Media: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా ఆయనకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అజిత్ అన్ని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం అజిత్ విడామయుర్చి అనే సినిమాలో నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మగిళ్ తిరమేని దర్శకత్వం వహిస్తున్నాడు.


ఇక ఈ చిత్రంలో అజిత్ సరసన త్రిష, ప్రియా భవాని శంకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి నుంచి కూడా అజిత్ ఒక రేసర్ అన్న విషయం తెల్సిందే. సినిమాలు చేయకపోతే అజిత్ రేసింగ్ లో పాల్గొంటూ ఉంటాడు. ఇక సినిమాలో సైతం రియల్ స్టంట్స్ అన్ని డూప్ లేకుండా చేస్తూ ఉంటాడు.

తాజాగా విడామయుర్చి సినిమాలో కూడా అలానే స్టంట్స్ చేస్తుండగా అజిత్ కు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ లోనే ఈ కారు ప్రమాదం జరిగిందని మేకర్స్ తెలుపుతూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో కారు వేగంగా నడుపుతూ.. అజిత్ కారును అదుపుచేయలేక బోల్తా కొట్టించాడు. పోలీస్ అయిన అజిత్.. ఒక ఖైదీని కారులో సంకెళ్లు వేసి తీసుకెళ్లే సీన్ లా కనిపిస్తుంది.


Also Read: Ramayana: బాలీవుడ్ రామాయణ.. రంగంలోకి ఆస్కార్ విన్నర్లు.. ?

ఇక బోల్తా కొట్టిన తరువాత కారులో అజిత్.. ఆరవ్(అజిత్ పక్కన ఉన్న ఖైదీ) నువ్వు బాగానే ఉన్నావ్ గా.. ? నీకేం కాలేదు గా అని అడుగుతున్న వాయిస్ వినిపిస్తుంది. ఆ తరువాత చిత్ర బృందం వచ్చి వారిని బయటకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసాక రియల్ హీరో అజిత్ అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అజిత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×