BigTV English

Ajith vs Prabhas : అజిత్‌తో పోటీప‌డ‌లేక‌పోయిన ప్ర‌భాస్‌

Ajith vs Prabhas : అజిత్‌తో పోటీప‌డ‌లేక‌పోయిన ప్ర‌భాస్‌

Ajith vs Prabhas : ఆన్ లైన్ ట్రెండ్స్ అంటే కోలీవుడ్ జ‌నాలు చేయాల్సిందే అన్న‌ట్టుంది ప‌రిస్థితి. కోలీవుడ్ హీరోల అప్‌డేట్స్, తెలుగు హీరోల అప్‌డేట్స్ ఉన్న సంద‌ర్భాల్లో ఎక్కువ‌గా నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌ని ట్విట్ట‌ర్‌లో కోలీవుడ్ హీరోలే ఆక్యుపై చేస్తున్నారు. ఇయ‌ర్ ఎండింగ్‌లోనూ మ‌న డార్లింగ్ మీద పైచేయి సాధించారు అజిత్‌కుమార్‌. అజిత్ హీరోగా న‌టించిన సినిమా తునివు. తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ అవుతోంది. 2023 పొంగ‌ల్‌కి రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ని ఇయ‌ర్ ఎండింగ్ ఈవినింగ్ విడుద‌ల చేశారు. తునివు సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచీ ట్రెండింగ్‌లో ఉంది. ట్రైల‌ర్‌ని ఇవాళ విడుద‌ల చేస్తున్న‌ట్టు దుబాయ్ బుర్జ్ ఖ‌లీఫా మీదా, న్యూయార్క్ టైమ్స్ న్యూ స్క్వ య‌ర్ మీదా ట్రైల‌ర్ ప్లే అవుతుంద‌ని ముందు నుంచే హింట్స్ ఇచ్చారు మేక‌ర్స్. సో ఎలాగైనా టాప్‌లో ట్రెండ్ చేయాల‌ని ఫిక్స్ అయ్యారు అభిమానులు.


ఇయ‌ర్ ఎండింగ్ ని పుర‌స్క‌రించుకుని ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కె వీల్ మేకింగ్ వీడియో కూడా విడుద‌లైంది. అయితే చ‌డీ చ‌ప్పుడు లేకుండా ఈ మేకింగ్ వీడియో విడుద‌ల కావ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ అల‌ర్ట్ గా లేరు. దాంతో ట్రెండింగ్‌లో టాప్ టెన్‌లో అయితే ఉన్నారు కానీ, టాప్‌5లో కూడా చోటు ద‌క్కించుకోలేక‌పోయారు ప్ర‌భాస్‌. ఫ్యాన్స్ ఎంత పుష్ చేసినా, మేక‌ర్స్ త‌ర‌ఫు నుంచి స‌పోర్ట్ ఉండాల్సిందేనంటున్నారు క్రిటిక్స్. ముందు నుంచే అప్‌డేట్ ఇస్తామ‌ని చెబుతూ వ‌స్తే, ఫ్యాన్స్ అల‌ర్ట్ అయ్యేవార‌ని, ఫ‌స్ట్ మేకింగ్ వీడియో కూడా రికార్డు నెంబ‌ర్స్ తో ట్రెండ్ అయ్యేద‌ని వారి మాట‌. ఫ్యూచ‌ర్‌లో అయినా ఇలాంటి విష‌యాల మీద ఫోక‌స్ చేస్తే బావుంటుంది ప్ర‌భాస్‌తో సినిమాలు తెర‌కెక్కించే నిర్మాత‌లు. అజిత్ ఫ్యాన్స్ ట్విట్ట‌ర్ ట్రెండ్‌ని గ‌మ‌నించిన విజ‌య్ ఫ్యాన్స్ కూడా అల‌ర్ట్ అయ్యారు. సోమ‌వారం రిలీజ్ కానున్న వారిసు ట్రైల‌ర్ హ్యాష్‌ట్యాగ్‌ని య‌మా స్పీడుతో ట్రెండింగ్‌లోకి తెచ్చేశారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×