BigTV English

Srinidhi Shetty: హిట్ భామ.. ప్లాప్ హీరోతో రొమాన్స్.. వర్కవుట్ అయ్యేనా ?

Srinidhi Shetty: హిట్ భామ.. ప్లాప్ హీరోతో రొమాన్స్.. వర్కవుట్ అయ్యేనా ?

Srinidhi Shetty: ఈ మధ్య కాలంలో కన్నడ హీరోయిన్లు టాలీవుడ్ లో  పాగా వేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నిజం చెప్పాలంటే టాలీవుడ్ లో ప్రస్తుతం కన్నడ హీరోయిన్స్ హవా నడుస్తుందని చెప్పొచ్చు. గత కొన్నేళ్లుగా కన్నడ నుంచి వచ్చిన హీరోయిన్స్ తెలుగులో మంచి విజయాలను సాధించి ఇక్కడనే సెటిల్ అవ్వాలని చూస్తున్నారు. తెలుగు డైరెక్టర్స్  తో సహా నిర్మాతలు, హీరోలు కూడా కన్నడ హీరోయిన్స్ కావాలని ఏరి కోరి తెలుగుతెరకు పరిచయం చేస్తున్నారు.


 

తాజాగా  కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమాతో శ్రీనిధి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రంలో ఆమె యష్  సరసన నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత ఈ చిన్నదాన్ని రేంజ్ వేరే లెవెల్ లో ఉంటుందని అనుకున్నారు. కానీ, అమ్మడు మాత్రం కేజిఎఫ్ లాంటి హిట్ తరవాత సరైన విజయాన్ని అందుకున్నదే లేదు. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈ చిన్న దానికి ఒక్క విజయం కూడా దక్కలేదు.


 

ఇక దీంతో శ్రీనిధి తెలుగు బాట పట్టింది. తెలుగులో హిట్ 3 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమా  మే నెలలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాతోనే శ్రీనిధి తెలుగులో మంచి విజయాన్ని అందుకోవడంతో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని సమాచారం. ఇప్పటికే సిద్దు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా అనే సినిమాలో ఈ చిన్నది నటిస్తోంది. మొదట ఈ సినిమానే ప్రకటించినా.. హిట్ 3 ముందు రిలీజ్ అవడంతో బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఈ హిట్ తో శ్రీనిధి కోలీవుడ్ లో కూడా అవకాశాలను అందుకుంటుంది.

 

శ్రీనిధి మరో స్టార్ హీరో సరసన నటించడానికి సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గత కొన్నేళ్లుగా వరుస పరాజయలతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే వచ్చిన గుడ్ బాడ్ అగ్లీ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అధిక్ రవిచంద్రన్ తోనే అజిత్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడని అందరికీ తెలిసిదే. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

 

ఇక అందుతున్న సమాచారం ప్రకారం అధిక్ – అజిత్ చిత్రంలో శ్రీనిధి హీరోయిన్ సెలెక్ట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీనిధి కోలీవుడ్ లో విక్రమ్ సరసన కోబ్రా సినిమాలో నటించి మెప్పించింది. అయితే అమ్మడి నటనకు మంచి మార్పులే పడిన సినిమా మాత్రం విజయాన్ని దక్కించుకోలేకపోయింది. స్టార్ హీరోల సరసన నటించిన కూడా శ్రీనిధికి కలిసి రావడం లేదు. ఇక ఇప్పుడు ప్లాప్ హీరో అయినా అజిత్ తో  జత కట్టడం ఆమె కెరీర్ కు ప్లస్ కానుందా..? మైనస్ కానుందా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే మేకర్స్ ఈ చిన్నదాన్ని సినిమాలోకి ఆహ్వానించనున్నారని సమాచారం. మరి ఈ సినిమాతో శ్రీనిధి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×