BigTV English

Akhanda 2: బాలయ్య సినీ కెరియర్ లోనే భారీ బడ్జెట్.. ఎన్ని కోట్లంటే?

Akhanda 2: బాలయ్య సినీ కెరియర్ లోనే భారీ బడ్జెట్.. ఎన్ని కోట్లంటే?

Akhanda 2:బాలకృష్ణ(Balakrishna)కి ఈ మధ్యకాలంలో అన్ని బ్లాక్ బస్టర్ హిట్సే పడుతున్నాయి. అలా ఈయన నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి,తాజాగా వచ్చిన డాకు మహారాజ్.. ఈ సినిమాలన్నీ కూడా బాలకృష్ణని ఇండస్ట్రీలో మంచి స్థాయిలో నిలబెట్టాయి. అయితే అలాంటి బాలకృష్ణ తాజాగా అఖండ-2 (Akhanda-2 )సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. మహా కుంభమేళ స్టార్ట్ అయిన సమయంలోనే అఖండ -2 మూవీకి సంబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. మరి షూటింగ్ దశలో ఉన్న అఖండ-2 మూవీకి సంబంధించి బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..


రూ.100 కోట్ల బడ్జెట్ తో శివతాండవం..

బాలకృష్ణ కెరీర్ లోనే బాక్సాఫీస్ లెక్కల్లో రికార్డు క్రియేట్ చేసిన మూవీ అఖండ (Akhanda) అని చెప్పుకోవచ్చు.ఈ సినిమా రూ. 150 కోట్ల వసూళ్లు కలెక్ట్ చేసి బాలకృష్ణ కెరీర్ లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా పేరు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ (Daku Maharaj) సినిమాలు టాక్ పరంగా బాగున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం రూ.150 కోట్లు దాటలేదు.ఇక నాలుగేళ్ల క్రితమే బాలకృష్ణ రూ.150 కోట్లు బాక్సాఫీస్ దగ్గర వసూలు చేశారంటే ప్రస్తుతం ఆయన క్రేజ్ ఎంతలా పెరిగిందో ఊహించవచ్చు. కాబట్టి అఖండ -2 మూవీ బాక్సాఫీస్ లెక్కలు అంతకుమించి ఉంటాయి అని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. ఇక అఖండ 2 ఏకంగా రూ. 300 కోట్ల టార్గెట్ గా బరిలోకి దిగాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సినీ పరిశ్రమ మాట్లాడుకుంటుంది. అయితే రూ. 300 కోట్ల టార్గెట్ అంటే దానికి తగ్గట్లే సినిమా నిర్మాణం కూడా ఉండాలి. ఇక అఖండ 2 ‘శివతాండవం’ పేరుతో ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది..


బాలయ్య టార్గెట్ రీచ్ అవుతారా.?

ఇక అఖండ -1 కి రూ.60 కోట్ల బడ్జెట్ పెట్టగా రూ.150 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక ఈ నాలుగేళ్లలో బాలయ్య మార్కెట్ బాగా పెరిగిపోయింది..కాబట్టి అఖండ -2(Akhanda-2) కి కచ్చితంగా రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెట్టాల్సిందే. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ పెడితే వసూళ్ల పరంగా రూ.300 కోట్లు రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే బాలకృష్ణ అఖండ సినిమాకి సంబంధించి సౌత్లో కంటే నార్త్ లోనే ఎక్కువ క్రేజ్ ఉంది. హిందుత్వం కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే మహా కుంభమేళా సమయంలో బాలకృష్ణ(Balakrishna)కు సంబంధించిన పోస్టర్లు బస్సులపైన కనిపించడంతో నార్త్ లో బాలయ్య క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతుంది.అయితే అలాంటి అఖండ -2 కి రూ.120 కోట్ల బడ్జెట్ పెడితే కచ్చితంగా రూ.300 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగాల్సి వస్తుంది. మరి బాలకృష్ణ అఖండ-2(Akhanda-2) మూవీ రూ.300 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ ని రీచ్ అవుతుందా..? సినిమాకి అన్ని కోట్ల కలెక్షన్స్ వస్తాయా..?అనేది సినిమా తీసే డైరెక్టర్ చేతిలో, నటించే హీరో చేతిలో ఉంటుంది. మరి చూడాలి బాలయ్య అఖండ -2 తో రూ.300 కోట్ల క్లబ్ లో చేరుతారా..? ఇప్పటివరకు తనకున్న రికార్డులన్నీ అఖండ -2 మూవీతో బద్దలు కొడతారా?అనేది ముందు ముందు తెలుస్తుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×