Akhanda -2..డాకు మహారాజ్ (Daaku maharaj)తర్వాత బాలకృష్ణ(Balakrishna) చేస్తున్న సినిమా అఖండ -2(Akhanda -2).. ఇప్పటికే 2021లో బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను(Boyapati Sreenu)దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ మూవీలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా అంచనాలు లేకుండానే వచ్చి అతి పెద్ద హిట్ కొట్టింది. అయితే బాలయ్యని అఘోర పాత్రలో ఎవరు చూస్తారు అని చాలామంది అనుకున్నారు. కానీ ఈ సినిమాలో బాలకృష్ణ అఘోర పాత్రలో అద్భుతంగా నటించారు. అలాగే కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి, రెండు మూడు సార్లు కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. కానీ ఎట్టకేలకు ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక సినిమా విడుదల సమయంలో కూడా చాలా గందరగోళం నెలకొంది. ఎందుకంటే కరోనా సమయంలో బయటికి ఎవరు రాలేని పరిస్థితి..
మహాకుంభమేళలో సినిమా షూటింగ్ మొదలు..
కానీ అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బాలకృష్ణ ముందుకు వచ్చి థియేటర్లలో అఖండ సినిమాని విడుదల చేశారు. ఇక ఈ సినిమా మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోయింది. దాంతో అఖండ సినిమా చూడడానికి కరోనాని కూడా లెక్కచేయకుండా ప్రేక్షకులు థియేటర్లకు తరలివచ్చారు. అలా భారీ హిట్ కొట్టిన అఖండ మూవీకి సీక్వెల్ గా అఖండ -2 కూడా ఉంటుంది అని మూవీ మేకర్స్ తెలియజేశారు. అయితే తాజాగా అఖండ 2 మూవీకి సంబంధించి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే అఖండ 2 మూవీని మహా కుంభమేళలో షూట్ స్టార్ట్ చేశారని తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయినటువంటి మహా కుంభమేళా జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మహా కుంభమేళలో బాలకృష్ణ – బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ 2 మూవీకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేశారట. ఈ సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశాలను ఈ మహా కుంభమేళలో చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కుంభమేళకు ఎంతో మంది సాధువులు, జనాలు తరలివస్తారో చెప్పనక్కర్లేదు. అలాంటి మహా కుంభమేళలో ఈ సినిమా షూట్ స్టార్ట్ చేయడం మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆ దేవుడి కృప వల్ల ఈ సినిమా కూడా భారీ హిట్ అవుతుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. అయితే అఖండ మూవీ హిట్ అవ్వడంతో అఖండ 2 మూవీపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి.
దసరా సందర్భంగా విడుదల..
ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే తెరకెక్కించాలి అని మూవీ మేకర్స్ కూడా భావిస్తున్నారట. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో గోపీచంద్ ఆచంట,రామ్ అచంటలు, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖండ 2 మూవీకి కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మళ్లీ రిపీట్ కాబోతున్న ఈ కాంబో కూడా బ్లాక్ బస్టర్ హిట్టే అని టాక్ వినిపిస్తోంది. అఖండ పార్ట్ 1 లో ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్,నటి పూర్ణ, జగపతిబాబులు కీలకపాత్రల్లో నటించారు. సీక్వెల్ లో కూడా ఈ నటీనటులు ఉంటారని తెలుస్తోంది. అలా భారీ అంచనాలతో అఖండ 2 మూవీ షూటింగ్ మహాకుంభమేళతో స్టార్ట్ అయిపోయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న దసరా కానుకగా విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది.