Jayam Ravi : టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జయం రవి. నిజానికి ఈ హీరో తన అసలు పేరు కన్నా ఈ పేరుతోనే ఎక్కువ ఫేమస్ అయ్యారు. అయితే ఇప్పుడు తనను జయం రవిగా పిలవొద్దని.. రవి అంటూ పిలవాలని సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను విడుదల చేశారు.
జయం రవి.. ఈ కోలీవుడ్ హీరో జయం సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇన్నాళ్ళ కెరీర్లో జయం రవిగానే ఫేమస్ అయ్యారు. అయితే ఇప్పుడు తనను ఈ పేరుతో పిలవొద్దని.. రవి లేదా రవి మోహన్ పేరుతోనే పిలవాలంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఇదే పేరును ఇకపై కొనసాగించాలనుకుంటున్నాను అంటూ తెలిపారు. ఇక తన సోషల్ మీడియా ఖాతా పేరును సైతం మార్చుకున్నారు. ఈ పోస్టులో “రవి మోహన్ స్టూడియోస్” అనే నిర్మాణ సంస్థను.. “రవి మోహన్ ఫాన్స్ ఫౌండేషన్” ను స్థాపిస్తున్నానని.. ఈ విషయాన్ని ఈ పోస్ట్ లో తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
సినిమాలపై ఆసక్తితోనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించానని తెలిపిన రవి.. ప్రతిభను ప్రోత్సహిస్తూ మంచి సినిమాలు అందించటమే తన ప్రొడక్షన్ హౌస్ లక్ష్యం అని తెలిపారు. అభిమానులే తన బలమని మెరుగైన సినిమాలు అందించేందుకు వారే తనకి మోటివేషన్ అంటూ తెలిపారు. మెరుగైన సమాజం కోసం తనవంతు కృషి చేస్తానని.. ఫాన్స్ ఏదైనా ఇవ్వాలని ఆలోచనతోనే ఈ ఫౌండేషన్ హౌస్ ను స్థాపించానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రవి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రముఖ ఎడిటర్ మోహన్ తనయుడే ఈ హీరో. ఇక దర్శకుడు మోహన్ రాజా ఆయన సోదరుడు. మోహన్ రాజా మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కించారు. రవి సైతం బాల నటుడిగా పలు సినిమాల్లో నటించారు. బావ బామ్మర్ది, పల్నాటి పౌరుషం చిత్రాల్లో కనిపించి అలరించారు. తమిళ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో వచ్చిన జయం సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన సినిమాతో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక అప్పటినుంచి అతని పేరు జయం రవిగానే ఫిక్స్ అయిపోయింది. ఇక గత ఏడాది సైరన్, బ్రదర్ వంటి చిత్రాలతో అలరించిన ఆయన.. పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. రవి మోహన్ సీనియర్ నిర్మాత సుజాత విజయకుమార్ కూతురు ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇక వ్యక్తిగత కారణాలతో వీళ్ళిద్దరూ 2024 లో విడాకులు తీసుకున్నారు. రవి కుమారుడు ఆరవ్ 2018లో వచ్చిన టిక్ టిక్ టిక్ సినిమాలో బాల నటుడిగా కనిపించాడు.
ALSO READ : త్రినాథరావు అన్నదాంట్లో తప్పేం ఉంది.. హీరోయిన్ అలానే ఉండాలి