BigTV English

Akhil Akkineni: అయ్యగారి కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు..?

Akhil Akkineni: అయ్యగారి కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు..?

Akhil Akkineni: అక్కినేని నట వారసుడుగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు అఖిల్ అక్కినేని. సిసింద్రీగా ఏడాది వయస్సులోనే ప్రేక్షకుల మనసులను దోచుకున్న అఖిల్.. మనం క్లైమాక్స్ లో కొద్దిసేపు కనిపించినా.. షో స్టీలర్ అనిపించుకున్నాడు. ఇక అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. ఆది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఇక దీంతో నాగ్.. అఖిల్ ను హీరోగా నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ, అఖిల్ లక్ మాత్రం కలిసి రాలేదు.


ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా అఖిల్ కు హిట్ ఇచ్చింది కానీ, అప్పటివరకు హిట్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డేకు మాత్రం బ్యాడ్ లక్ ను ఇచ్చింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తరువాత నుంచి ఇప్పటివరకు పూజా హిట్ అందుకున్నది లేదు. ఇక పూజా లక్ ను అఖిల్ కొట్టేశాడు అనుకున్నారు. కానీ, అది నిజం కాదు అని తెలియడానికి కొద్దిగా ఎక్కువ సమయమే పట్టింది. ఈ సినిమా తరువాత అఖిల్ నటించిన చిత్రం ఏజెంట్. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడకుంటే అంత మంచిది అని చెప్పొచ్చు.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోసం అఖిల్ మూడేళ్లు కష్టపడి బాడీని పెంచాడు.  ఎన్నో వాయిదాల తరువాత ఏజెంట్ రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. సరిగ్గా  ఎడిట్ చేయకుండా..  సినిమాను ఆదరాబాదరాగా రిలీజ్ చేయడంతో.. అసలు సినిమా చూడాలన్నా ఆసక్తి కూడా ప్రేక్షకులకు రాలేదు. పోనీ థియేటర్ లో కాకపోయినా ఓటీటీలో అయినా చూడొచ్చు అనుకుంటే.. ఇప్పటివరకు ఆ సినిమా ఓటీటీకి  మోక్షం దక్కలేదు.


ఏజెంట్ సినిమా తరువాత అఖిల్ మీడియా ముందుకు వచ్చింది కూడా లేదు.  ఈ మధ్యనే నాగార్జున ఒక ఈవెంట్ లో అఖిల్ మంచి హిట్ తోనే మీ ముందుకు వస్తానని చెప్పినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఆ హిట్ కోసం అఖిల్ బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్ యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా చేస్తున్నాడు. వినరో భాగ్యం విష్ణు కథ డైరెక్టర్  మురళీ కిశోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని తెలుస్తోంది.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం యూవీ క్రియేషన్స్ లోనే అఖిల్ తదుపరి సినిమా ఉంటుందట. కానీ, ఈలోపే నాగార్జున తన సొంత బ్యానర్ లో అఖిల్ ను మళ్ళీ రీ లాంచ్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు. ఒక కొత్త డైరెక్టర్ చెప్పిన కథ నాగ్ కు విపరీతంగా నచ్చడంతో తన బ్యానర్ లోనే ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇక ఈ సినిమాకు సంబంధించిన వివరాలను దసరా రోజున రివీల్ చేయనున్నారని తెలుస్తోంది. అనగా దసరాకు అయ్యగారి కొత్త సినిమా అప్డేట్ ఉండనుందని సమాచారం. ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం. ఇప్పటికే రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. మరి ఈ సినిమాలతోనైనా అఖిల్ విజయాన్ని అందుకుంటాడా.. ? లేదా..? అనేది చూడాలి.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×