BigTV English

Akhil – Zainab: జైనాబ్ కట్నం కింద ఎంత తెచ్చిందో తెలిస్తే షాక్..డబ్బు బంగారం, విలువ ఎంతంటే?

Akhil – Zainab: జైనాబ్ కట్నం కింద ఎంత తెచ్చిందో తెలిస్తే షాక్..డబ్బు బంగారం, విలువ ఎంతంటే?

Akhil – Zainab:సినీ ఇండస్ట్రీలో ఒక జంట పెళ్లి జరుగుతోంది అంటే దాదాపు అందరి కళ్ళు ఆ పెళ్లి పైనే. ఆ పెళ్లి ఖర్చు ఎంత? కట్నం కింద పెళ్లికూతురు ఎంత తీసుకొస్తోంది ? వారి ఆస్తుల వివరాలేమిటి? పెళ్లికి ఎవరెవరు అతిథులుగా వస్తున్నారు? ఇలా ప్రతి విషయాన్ని ఆరా తీస్తూ ఉంటారు. ఇదే క్రమంలోనే తమ స్థాయికి తగ్గట్టుగా సెలబ్రిటీలు కూడా కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరీ పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్(Allu Arjun), ఎన్టీఆర్(NTR ) ఇలా వీరందరూ కూడా ఇండస్ట్రీలో అందర్నీ ఆశ్చర్యపరిచేలా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరీ పెళ్లి చేసుకున్నారు. అంతే కాదు వాళ్ళ భార్యల నుంచి వందల కోట్ల కట్నాలు కూడా పొందిన విషయం తెలిసిందే.


వైరల్ గా మారిన అక్కినేని కొత్త కోడలు తెచ్చిన కట్నం..

ఇప్పుడు ఆ జాబితాలోకి అఖిల్ అక్కినేని (Akhil Akkineni)కూడా చేరిపోయారు. పెళ్లి సింపుల్ గానే జరిగినా.. అటు బిజినెస్ మాన్ కూతురు కావడంతో కట్నం కూడా భారీగానే తెచ్చిందని సమాచారం. మరి అఖిల్ వివాహం చేసుకున్న అమ్మాయి.. జైనాబ్ అక్కినేని ఇంటికి చిన్న కోడలిగా అడుగు పెడుతూ.. తన వెంట ఎంత కట్నం తీసుకొచ్చింది? అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి జైనాబ్ అక్కినేని ఇంటికి కోడలుగా వస్తూ.. ఎన్ని కోట్ల ఆస్తి తన వెంట తీసుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం..


వేలకోట్ల ఆస్తికి వారసురాలిగా అఖిల్ భార్య..

గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో విహరిస్తున్న అక్కినేని అఖిల్ – జైనాబ్ రవ్ డ్జీ.. ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ 6న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జైనాబ్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఈమె చాలా ప్రైవేట్ లైఫ్ ను ఇష్టపడుతుంటారు. ఈమెకు సంబంధించిన విషయాలు మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఈమె ఒక ఆర్టిస్ట్. కల్చరల్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందింది. పెయింటింగ్ అంటే మహా ఇష్టం. తరచుగా ఈమె వేసిన పెయింటింగ్స్ హైదరాబాదు మొదలుకొని దుబాయ్ వరకు పలు ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తూ ఉంటుంది.

జైనాబ్ తండ్రి ఆస్తుల విలువ ఎంతంటే?

ఈమె తండ్రి జుల్ఫీ రవ్ డ్జీ. ఈయన పెద్ద వ్యాపారవేత్త నిర్మాణ రంగంలో కూడా ఆయనకు దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉంది. అంతేకాదు ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కూడా కలిగి ఉన్నారు. ఆ సంస్థకు ఈయన ఎండి, చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. పలుచోట్ల వీరికి వీటీ యూనిట్లు కూడా ఉన్నాయి. అంతేకాదు ముంబై బేస్డ్ ఫ్యామిలీ అయినా హైదరాబాదులోనే స్థిరపడ్డారు. పైగా ఎనర్జీ కంపెనీలతో పాటు ఇతర వ్యాపార రంగాల్లో కూడా స్థిరపడ్డారు. దీన్ని బట్టి చూస్తే వీరి ఆస్తులు విలువ వేల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఇక ఇండియా వైడ్ గా కన్స్ట్రక్షన్, పవర్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయని సమాచారం.

జైనాబ్ కట్నం కింద ఎన్ని కోట్లు తెచ్చిందో తెలుసా?

ఇన్ని వేల కోట్లకు ఆస్తిపరురాలు కాబట్టే.. అందుకు తగ్గట్టుగానే ఈమె తన అత్తవారింటికి కట్నంగా భారీగా ఆస్తులు తీసుకొచ్చినట్లు సమాచారం. హైదరాబాదులో ఖరీదైన బంగ్లా తో పాటు అత్యాధునిక టెక్నాలజీతో తయారుచేసిన రెండు కార్లను తన వెంట తెచ్చిందట. అంతేకాదు సుమారుగా ఒకటి నుండి రెండు కేజీల వరకు బంగారం కూడా తెచ్చినట్లు సమాచారం.

అత్యంత సంపన్నుల జాబితాలో అఖిల్?

ఇటీవల ఒక డైమండ్ నెక్లెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాదండోయ్ తండ్రి మెచ్చిన కూతురు కావడంతో తండ్రి వ్యాపారాలలో పది శాతం వాటా కూడా పొందనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ వేలకోట్ల ఆస్తికి అధిపతిరాలు కాబట్టి ఈ మాత్రం తెచ్చి ఉంటుందని అందరూ ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఇదే అయితే అఖిల్ కూడా అత్యంత సంపన్నుల జాబితాలో చేరిపోయారని చెప్పవచ్చు.

ALSO READ:Samantha: ఆపండి ఇక.. నడి రోడ్డుపై సమంత కేకలు.. ఎందుకంత కోపం?

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×